బిగ్ ఎక్స్ క్లూజివ్ : వైసీపీ ఎమ్మెల్యేలందరిని బర్తరఫ్..!

0
341

టైటిల్ చూసి షాక్ అయ్యారా. అవ్వాల్సిందే. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగని ఘటన ఆంద్రప్రదేశ్ లో జరగబోతున్నట్లు సమాచారం. చంద్రబాబు ప్రభుత్వం చేతిలోని అధికారంతో ప్రతిపక్షంలోని 45 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీవితాన్ని రాయబోతున్నారు. ఒకే ఒక్క డెసిషన్ తో వైసీపీ ఎమ్మెల్యేలందరినీ అనర్హులుగా ప్రకటించే ఛాన్స్ వచ్చింది. అది కూడా రాజ్యాంగ బద్దంగా. అవును ఇప్పటి వరకు ఎవరూ ఊహించని రాజకీయ పరిణామాల దిశగా ఏపీ అడుగులు వేస్తోంది.
ఆరు నెలలుగా అసెంబ్లీకి హాజరు కాలేదు అనే నెపంతో బర్తరఫ్‌ చేయాలని ఆలోచిస్తున్నటు సమచారం.

ఏ అసెంబ్లీ అయినా కచ్చితంగా ఆరు నెలలకు ఒకసారి సమావేశం కావాల్సిందే. అది రాజ్యాంగం చెబుతున్న మాట. అసెంబ్లీ రూల్స్. అంటే ఆరు నెలల్లో కచ్చితంగా సభ సమావేశం అవుతుంది అంటే సభ్యులందరూ కూడా విధిగా హాజరుకావాల్సిందే. కనీసం స్పీకర్ కు సమాచారం లేకుండా హాజరుకాకపోతే వారిని అసెంబ్లీ సాక్షిగా అనర్హులుగా ప్రకటించొచ్చు. ఇదే నిబంధన ప్రకారం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 45 మంది ఎమ్మెల్యేలందరినీ బర్తరఫ్‌ చేయాలనే ఆలోచన చంద్రబాబు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఏపీ అసెంబ్లీకి చివరిసారిగా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరైంది మే నెల 16వ తేదీ 2017. జీఎస్టీ ఆమోదం కోసం సభ జరిగింది. ఆ తర్వాత నవంబర్ 10, 2017 మళ్లీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలను బహిష్కరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్. అది పార్టీ నిర్ణయమే. స్పీకర్ కు ఎలాంటి సమాచారం లేదు. ఈ క్రమంలోనే సభకు ఎన్నిక అయిన ఎమ్మెల్యే.. ఎలా సమాచారం లేకుండా సభకు హాజరుకాకపోతే వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చివరిసారిగా మే 16వ తేదీ హాజరయ్యాయి. అంటే ఇప్పటికే ఏడు నెలలు అయిపోయింది. మధ్యలో ఓ సమావేశానికీ డుమ్మా కొట్టారు. రాజ్యాంగం ప్రకారం.. ఓ ఎమ్మెల్యే ఎలాంటి సమాచారం లేకుండా సభకు హాజరుకాకపోతే వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం రాజ్యాంగం కల్పిస్తుంది. ఇది ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం.వైసీపీ నుంచి జంపింగ్ చేసిన వారంత అసెంబ్లీకి హాజరవుతున్నారు కాబట్టి వారంత సేఫ్ సైడ్‌ ఉన్నట్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here