మా ఓటు మీకే సారూ.. తిరువీధులకు డ్వాక్రా సంఘాల మద్దతు

0
134

ఏపీ స్టేట్ క్యాపిటల్ లో అంతర్భాగంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గం టీడీపీ సీటుపై హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈసారి కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వాలని దాదాపు టీడీపీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది. యువనేతగా గుర్తింపు పొందిన తిరువీధుల శ్రీనివాసరావు(నాని) రేసులో ముందున్నారు. మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కమలపై ఉన్న మరకలు ఆయనకు కలిసి వస్తున్నాయి. బాగా చదువుతున్న వ్యక్తిగా, విజన్ ఉన్న యువనేతగా లోకేష్ టీంలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు తిరువీధుల. ఇదే క్రమంలో.. ఏపీ రాష్ట్రంలోనే ఫస్ట్ టైం పార్టీకి డిజిటల్ ప్రచారం కూడా మొదలుపెట్టి.. మంచి మార్కులు కొట్టేయటం ప్లస్ పాయింట్ అయ్యింది.

మంగళగిరి యువనేత తిరువీధుల శ్రీనివాసరావుకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని స్థానిక నేతలు, కార్యకర్తలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా పాత వాసనలతో కంపుకొట్టిన మంగళగిరిని కడిగేయాలన్నా.. కొత్త తరం యువతను ప్రోత్సహించాలన్నా తిరువీధుల శ్రీనివాసరావు కరెక్ట్ పర్సన్ అంటున్నారు. అంతేకాదండీ.. డ్వాక్రా సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. మెజార్టీగా సొంత సామాజికవర్గంలోని మెజార్టీ డ్వాక్రా సంఘాల మహిళలు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. గత పాలకుల పరిపాలనలో చేసింది ఏమీ లేదని.. మహిళలకు ఒరగబెట్టింది ఏంటని నిలదీస్తున్నారు మహిళలు. పాత నేతల మాటలు నమ్మీనమ్మీ.. మోసపోయాం అంటున్నారు మహిళలు. కొన్ని డ్వాక్రా సంఘాలు అయితే ఏకంగా టీడీపీ అధిష్టానానికి లేఖలు తీర్మానాలు చేసి పంపించాలని నిర్ణయించటం మంగళగిరిలోనే సంచలనంగా మారింది.

డ్వాక్రా సంఘాల మద్దతు తిరువీధుల శ్రీనివాసరావుకే ఉందన్న వార్తలు మంగళగిరి నియోజకవర్గంతోపాటు.. మంగళగిరి పట్టణంలో చర్చనీయాంశం అయ్యింది. ఇప్పటికే LED స్క్రీన్ ప్రచారంతో జనంలోకి వెళ్లిపోయారు.. ఇప్పుడు డ్వాక్రా సంఘాల మద్దతు కూడా లభించటం విశేషంగా చెప్పుకుంటున్నారు. యువనేతగా, మచ్చలేని వ్యక్తిగా తిరువీధుల శ్రీనివాసరావుకి కలిసి వచ్చే అంశం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here