మోడీపై విశ్వాసం ఉంటే, అవిశ్వాసం ఎందుకు జగన్: చంద్రబాబు

36
TDP to contest with out alliances in 2019 elections
TDP to contest with out alliances in 2019 elections

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. మీడియాలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కాన్ఫరెన్స్ లో బాబు ప్రస్తావించారు.

ప్రధాని మోడీపై విశ్వాసం ఉందని, ఆయన న్యాయం చేస్తారని భావిస్తున్నామని విజయసాయి చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబు గుర్తుచేసి, వైసీపీపై ప్రశ్నలు సంధించారు. మోడీపై వైకాపాకు అంత విశ్వాసం ఉంటే, మళ్లీ అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టాలంటున్నారు..? అంత విశ్వాసం ప్రధాని మోడీపై మీ పార్టీకి ఉంటే, ఇంకా రాజీనామాల డిమాండ్లు ఎందుకు చేస్తున్నారంటూ చంద్రబాబు వైసీపీని సూటిగా ప్రశ్నించారు. కాన్ఫిడెన్స్ ఉంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎందుకు పెట్టమంటున్నారో జగన్ స్పష్టం చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఒకవైపు కేంద్రంపై విశ్వాసముందని, మరోవైపు అవిశ్వాసం పెట్టాలని వైసీపీ డొంకతిరుగుడుగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

టీడీపీ ఎంపీలు రాష్ట్రం కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని సూచించారు. సభ నుంచి సస్పెండ్ చేసినా వెనుకంజ వేసే ప్రసక్తి లేదని, లక్ష్యం నెరవేరే వరకూ పోరాటం ఆపద్దని తమ నాయకులకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు.