నెలవంక దర్శనమిచ్చింది.. ఆగస్టు 22న బక్రీద్ పండగ…..!

10

    ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం ఏటా జిల్ హజ్ నెలలో నెలవంక దర్శనం ఇచ్చిన 10వ రోజు బక్రీద్ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది తమిళనాడులోని మదురైలో నెలవంక కనబడినట్లు రుహియతే హిలాల్ కమిటీ(నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్ పాషా ఖుత్తారీ తెలిపారు. అయితే ఈ సమాచారం కాస్త ఆలస్యంగా తెలిసినట్లు ఆయన పేర్కొన్నారు. కావున ఈ ఏడాది నెలవంక దర్శనమిచ్చిన 10రోజు ఆగస్టు 22న బక్రీద్ జరుపుకోవాలని ఆయన ముస్లింలకు సూచించారు.  ఈ మేరకు…మెజంజాహీ మార్కెట్ లోని కమిటీ కార్యాలయంలో ప్రకటించారు.