బ్యాంక్ లను కాపాడమంటూ చిలుకూరు బాలాజీకి రుణ విమోచన పూజలు!

62
Chilukuru balaji temple devotees perform pooja for banks safety
Chilukuru balaji temple devotees perform pooja for banks safety

దేశంలో పరిస్థితులు ఎంత విచిత్రంగా మారిపోయాయో చూస్తుంటే, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒకప్పుడు వర్షాల కోసం, విశ్వశాంతి కోసం పూజలు, యాగాలు చేసేవారు. అయితే, తాజాగా బ్యాంకుల్ని దోచుకునే రాబందులు ఎక్కువైన నేపథ్యంలో, లక్షలాది కోట్ల ప్రజాధనం దోపిడీకి గురవుతోంది. ఈ పరిస్థితి నుంచి కాపాడమని చిలుకూరు బాలాజీకి రుణవిమోచన పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు.

దేశవ్యాప్తంగా, బడా బడా వ్యాపారవేత్తల పేరుతో, అప్పులు తీసుకుని ఎగ్గొట్టి, ఒకరకంగా మధ్యతరగతిపై, సామాన్యులపై భారం పడేలా చేస్తున్న ఐపీగాళ్ల నుంచి కాపాడు స్వామీ అంటూ ఫిబ్రవరి 19న బాలాజీకి ప్రత్యేకపూజలు నిర్వహించారు అర్చకులు. దీనికి భక్తులు రుణవిమోచన పూజ అని పేరు పెట్టడం విశేషం. బ్యాంకుల్లో దాచుకున్న ప్రజాధనం క్షేమంగా, భద్రంగా ఉండాలని భక్తులు మొక్కుకోగా, ప్రధాన అర్చకులు రంగరాజన్ దగ్గరుండి మరీ ఈ పూజలు చేయించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ లా మరొకటి జరక్కూడదని ఈ పూజలు నిర్వహించామని అర్చకులు చెబుతున్నారు.

దేశంలో కోట్లాది మంది నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు సంపాదించుకున్న డబ్బును వ్యాపారవేత్త అన్న పేరుతో బడాబాబులు దోచుకుంటున్నారని, బ్యాంకింగ్ వ్యవస్థలు రాజకీయ జోక్యానికి దూరంగా ఉండాలని ఆశిస్తున్నారు భక్తులు. ఈ సందర్భంగా భక్తులు రుణవిమోచన నృసింహ స్తోత్రాన్ని పఠించారు.