వైకుంఠ ఏకాదశి కోసం తిరుమలకు పోటెత్తిన భక్తజనం..!

634

రేపు హిందువులకు పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో, తిరుపతిలో భక్తజనం పోటెత్తారు. తండోపతండాలుగా భక్తులు దర్శనం కోసం వచ్చేయడంతో, మొత్తం కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. వాటితో పాటు నారాయణగిరి గార్డెన్ లోని అదనపు షెడ్లు సైతం భక్తజనంతో నిండిపోయాయి. దీంతో ఇక క్యూలైన్స్ లోకి వెళ్లవద్దని, వెళ్లినా ముక్కోటి ఏకాదశి రోజున దర్శనం అయ్యే అవకాశాలు ఉండవని, కొత్తగా వచ్చే భక్తులకు టీటీడీ అనౌన్స్ చేస్తోంది.

ఇదిలా ఉంటే, కడప జెడ్పీటీసీ ఛైర్మన్ రవి టీటీపై విరుచుకుపడ్డారు. తాను జిల్లాకు ప్రథమ పౌరుడినని, ఎంపీ లతో సమానంగా ఏకాదశి కోసం ఆరు టిక్కెట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారాయన. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుదర్శనం ఎనలేని పుణ్యాన్ని ప్రసాదిస్తుందనేది హిందువుల నమ్మిక. తిరుపతి మాత్రమే కాక, రెండు తెలుగు రాష్ట్రాల్లోని విష్ణు దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడబోతున్నాయి.