దేవుడు ఫోటోలను పెట్టుకునే వారంతా చూడాల్సిన వీడియో..

625

ప్రస్తుత మారుతున్న కాలంలో.. అందరిది మెకానికల్ లైఫ్..జీవితంలో ఏదో సాధించాలన్న కసి.. దానిపై ఎన్నో ఆశలు.. మరెన్నో ప్రయత్నాలు. అందుకోసం దేవుడిపై ఎక్కువగా నమ్మకం పెంచుకుంటున్నారు జనం. నిత్యం దేవాలయాలకు వెలుతున్నా…తమ కోరికలను చెప్పుకుంటున్నారు. వారం వారం ఉపవాసాలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య అదే దైవం తమ వద్దే ఉండాలన్న కోరికతో.. దేవుడునే తమ పాకెట్ లోకి తెచ్చుకుంటున్నారు కొందరు. దీంతో ఫోన్ వాల్ పేపర్ పై దేవుడి ఫోటో పెట్టుకుంటున్నారు. అయితే ఇదంతా తప్పు అంటున్నారు విశ్లేషకులు.. కొందరు పండితులు.

ఎందుకంటే దైవం అంటే అది ఒక శక్తి.. దానిని పవిత్రంగా ఉంచుకోవాలి. అపవిత్రం చేయకూడదు. అందుకే దానికి అంత ప్రత్యేకత. దాని స్ధాయి వేరు.. దానిని సామాన్యలమైన మనం ఇష్టానుసారం చేసి దాని ప్రత్యేకతను,ఔనత్యాన్ని తగ్గించకూడదట. ఫోన్ లో దేవుడు ఫోటో ఉంటే ఆయన విలువ తగ్గించినట్టేనంట. ఎలా అంటే వాట్సప్ లో , ఫేస్ బుక్ లో దేవుడు ఫోటోను పెట్టుకుంటే.. రకరకాల మనుషులు ఆ ఫోటోలను చూస్తుంటారు.వాళ్లు ఆ ఫోటోను చూసినప్పుడు మీపైన ఉన్న ఉద్దేశంతోనే ఆ ఫోటోను చూస్తుంటారు.

కొందరు మిమ్మల్ని ఇష్టపడవచ్చు.. మరికొంత మంది వ్యతిరేకించ వచ్చు. ఇలా పవిత్రంగా ఉండే దేవున్ని బయటకి తీసుకువచ్చి లేనిపోనివి అపాదించటం అనేది మంచి పద్దతి కాదని పండితులు చెబుతున్నారు. దేవుడిపై ఇష్టం ఉంటే గుడికెళ్లి పూజలు చేసుకోవాలి తప్ప.. ఇలా ఫోన్ లో, వాట్సప్ లో చేయటం వాళ్లకే మంచిది కాదని అంటున్నారు.