కష్టాల తొలగాలంటే, శనిదేవుడికి ఇలా చేస్తే ఫలితం..!

808
lord-shani-worship-shani-trayodasi

మానవజీవితాలపై శనీశ్వరుడి ప్రభావం అంతా ఇంతా కాదు. ఆయన ధాటికి తట్టుకోలేక చాలా మంది బాధపడుతుంటారు. కానీ ఆయనే వెళ్తూ, వెళ్తూ ఒక అందమైన జీవితాన్ని ప్రసాదిస్తాడని చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలంటే..శనీశ్వరుడికి ఏం చేస్తే ప్రీతకరమో తెలుసా..?

ఏ మనిషికీ బాధలు పడాలని ఉండదు. ఉన్నంతలో కాస్త మనశ్శాంతిగా జీవితం నడవాలని కోరుకుంటారు. అయితే ఏల్నాటి శని, శనీశ్వర ప్రభావం ఉన్నవారికి మాత్రం ఎన్నో ఆటంకాలు, కష్టాలు, ఇబ్బందులు ఎదరువుతాయి. అవమానాలు జరుగుతుంటాయి. ఆ దోషం నుంచి బయటపడటానికి ఎంత ప్రయత్నించినా, లాభం కనిపించదు. ఆ పరిస్థితులను ఎదుర్కోవాలన్నా, దాటాలన్నా దోష ప్రభావం నుంచి బయటపడాలన్నా శని త్రయోదశి ఒక మంచి మార్గం.

శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించాలి. ఆ రోజున నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రం దానం చేయవలసి ఉంటుంది. ఇక ఈ శని త్రయోదశి రోజున శివార్చన చేయనిదే, శని అనుగ్రహం లభించదు. అందువలన ఈ రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించి, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ మహాదేవుడిని పూజించాలి. ఈ విధంగా చేయడం వలన శనిదేవుడు శాంతిస్తాడు .. ఆయన శాంతిస్తే అనుగ్రహం లభిస్తుంది. శని దేవుడి అనుగ్రహం కారణంగా శని దోష ప్రభావం తగ్గుతూ వెళుతుంది. అనువలన శని త్రయోదశి రోజున శివుడిని .. శని దేవుడిని పూజించడం మరిచిపోకూడదు.