మహానంది ఆలయం లో ఎంజరుగుతోందో తెలుసా… ?

484

కర్నూల్ జిల్లా మహానంది ఆలయం లో మీకు తెలియని మోసాలు భక్తులని యెంత ఇబ్బంది పాలు చేస్తున్నయో ఒక సారి చూడండి..ఈఓ నిత్యా అన్నదానం డోనార్స్ ఉన్న, నిత్యం ఉచిత కూరగాయలు ఇస్తున్నవచ్చే భక్తులు వేలల్లో, లక్షల్లో ఉన్న కేవలం 100 మందికే మిగిలితే ఇంకో 20 మందికే అన్నదానం ఎందుకో తెలుసా..? “ఈ ఆలయం మొదట్లో భోజనం హోటల్ ఉంది ఆ హోటల్ వాడు సంవత్సరానికి అక్షరాలా 40 లక్షలు దేవాలయాన్ని కడతున్నాడంట. దేవాలయాల్లో అన్నదానం చేస్తే తనకు నష్టమని అతను చెప్పటంతో ఆలయ అధికారులు భక్తుల అన్నదాన విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారు..

ఈ దేవాలయం లో బాత్రూమ్స్ ఉండవ్ ఉన్న క్లోజ్ చేసేసి చేన్నాళ్ళు అయ్యింది ఎందుకో తెలుసా..? ఈ గుడికి లెఫ్ట్ సైడ్ పే యూజ్ బాత్రూమ్స్ ఉన్నాయ్ ఆడవాళ్లు , పసి పిల్లలు , మొగవారు ఎవరైనా ఒకటి కైనా రెండుకైన 10 రూపాయలు చెల్లిస్తేనే వెళ్ళనిస్తారు లేకపోతె లేదు పొరపాటున డబ్బులు రూమ్ లో మర్చి పొతే ఆడవాళ్లు ఐన ఏ చెట్టో చూసుకోవాలి…

దేవస్థానం రూములు ఉంటాయి ఒక రోజుకు 200 కానీ ఎప్పుడు ఫుల్ అనే చెపుతారు ఆ రూమ్స్ ఎవరు లేక పాడుపడి పందులు కూడా ఉండవ్ నల్లుల మంచాలు పరుపు లో కబ్బరి పీచు కనిపించేలా చిరిగిపోయి గదులు ప్రేతకళతో ఉంటాయి ఎందుకో తెలుసా ఆ చుట్టుపక్కల ఉండే లాడ్జ్ లు డీలాక్స్ రూమ్స్ అని ప్రైవేట్ రూమ్స్ వాళ్ళు మొత్తం అందరు కలసి సంవత్సరానికి 3 కోట్ల దాక ఇస్తారంటా

ఈ దేవాలయానికి
అలాగే చుట్టుపక్కల ఉన్న తినుబండారాల బండులు కలిపి నెలకి ఒక్కొక్క బండికి 1200 చప్పున కడతారంట అన్ని అధిక రేట్లకే అమ్ముతారు అక్కడ
, మీరు పువ్వులు కబ్బరికాయలు పూజ ద్రవ్యాలు ఏ దేవాలయానికి వెళ్లిన చేలా షాపులు ఉంటాయి కానీ మహానంది లో ఒక్క షాప్ మాత్రమే ఉంటుంది అక్కడ రేట్లకు హద్దు ఆపు ఉండదు భక్తులు ఏమి చేయలేక కొంటుంటారు ..

ఏ దేవాలయాల్లో ఐన శనేశ్వరస్వామి ని దర్శించక శివయ్యను దర్శిస్తారు కానీ ఇక్కడ చాలాదారుణం దేవుణ్ణి పెట్టి వ్యాపారం చేస్తున్నారు ఏంటంటే శివయ్యను ,కామేశ్వరి అమ్మవార్ని , రామాలయాన్ని , ఆంజనేస్వామి ని దర్శించక బయటికి వచ్చే దారిలో నవగ్రహాల ఆలయం ఉంటది బయటకి వచ్చే దారిని మూసేసి నవగ్రహాలు లోపలి నుండి అది ఎడమ వైపు నుండి ప్రదక్షణమ్ చేయమంటారు ఒక పంతులు మామూలుగా ఐతే నవగ్రహాల బయటవరకే భక్తులు ప్రదక్షణం చేస్తరు కానీ డబ్బు కోసం నవగ్రహాల లోపలి కి వెళ్లి ఎడమ వైపు నుండి ప్రదక్షణమ్ చేపించి దీపం వెలిగించాలి అన్ని చెప్పి ఒక్కరిదగ్గర 50 రూపాయలు వసూళ్లు చేస్తాడు ఆ పంతులు అదేంటి ఆరా తీయగా నవగ్రహాల ను సంవత్సరానికి 20 లక్షలకు పాడాడంట ఆ పంతులు..

ఈ దేవాలయానికి సంవత్సర ఆదాయం అక్షరాలా 11 కోట్లు అంట దేవాదాయశాఖ ఈ ఆదాయం తో బాత్రూమ్స్ కటించ వచ్చు , అన్నదానం , ఇంకా ఎన్నో చేయొచ్చు ధర్మాదాయ శాఖ ఏంచేస్తుందో దేవాలయాల్లో ఇంతంత మోసాలు జరుగు తుంటే ఇక్కడే కాదు భద్రాచలం , లో కాణిపాకం లో ఆలయ గర్భ గుడిలా ఫోటోలు తీయటం తప్పు కానీ గుడి బయట ఆవరణాల్లో సెల్ ఫోనుల్లో ఫోటోలు తీయనీయకుండా అక్కడ ఫోటో గ్రాఫేర్స్ కి కాంట్రాక్ట్స్ ఇచ్చేసి వాళ్ళతో డబ్బులు ఇచ్చి తప్ప ఫోన్ లో ఫొటోస్ తీయనీకుండా చేస్తున్నారు కూడా , చాల మందికి ఎదురైనా పరిస్తుతులు ఇంకా ఎన్నో హిందూ దేవాలయాల్లో కూడా ఇదే పరిస్థితి అసలు ఎంతంత దూరాలనుండి దేవాలయాల దర్శనాలకు వెళ్తున్న భక్తులకు కనీస సౌకర్యాలు లేకపోగా అనేక ఇబ్బందుల పాలు చేస్తున్నారు…