18 డిసెంబర్ 2017 నాటి రాశిఫలాలు..

700

దినఫలం

మేషం

మార్కెట్ రంగాల వారికి, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. మీ సంతానానికి దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. మీ మాటలను కొంత మంది వక్రీకరించే ఆస్కారం ఉంది.

వృషభం

వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ప్రైవేట్ సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. ధనవ్యయంతో కొన్ని పనులు సానుకూలమవుతాయి. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తితో పాటు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు.

మిథునం

భాగస్వామిక ఒప్పందాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవసాయ రంగాల వారు అనుభవజ్ఞుల సలహాలు పాటించటం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు రాణిస్తారు. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన బెనఫిట్స్ కోసం బాగా శ్రమించాలి. సన్నిహితుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు.

కర్కాటకం

సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. ఎంతో కొంత పొదుపు చేద్దామన్న మీ ఆలోచన ఫలించకపోవచ్చు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పనిభారం అధికం.

సింహం

భూసంబంధిత క్రయ విక్రయాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ప్రయాణాలు, బ్యాంకు పనుల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒక నష్టాన్ని మరొక విధంగా పూడ్చుకుంటారు. మీ నిజాయితీ, చిత్తశుద్ధి ప్రముఖులను ఆకట్టుకంటాయి.

కన్య

విద్యార్ధులు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రాజకీయ నాయకులు సభ సమావేశాలలో పాల్గొంటారు. కొన్ని విషయాలు చూసీచూడనట్లుగా వదిలేయటం మంచిది. స్త్రీలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగాలి. రుణాలు తీరుస్తారు.

తుల

ఆర్థికంగా నిలదొక్కుకోవటంతో పాటు రుణాలు తీరుస్తారు. ట్రాన్స్‌పోర్టు రంగాల్లో వారికి కార్మికుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఫ్లీడరు నోటీసులు, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. హామీలు ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు.

వృశ్చికం

గృహమునకు కావలసిన వస్తువులు అమర్చుకోగలుగుతారు. రైతులకు వాతావరణంలో మార్పు చికాకు కలిగిస్తుంది. ఆడిటర్లకు సంతృప్తి కానరాగలదు. ఉద్యోగస్తులకు పై అధికారుల వలన ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ముఖ్యులను కలుసుకుంటారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ధనస్సు

బ్యాంకింగ్ రంగాల వారికి చికాకులు తప్పవు. ప్రైవేటు సంస్థల్లోని వారు మార్పులకై చేయు ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ సంతానంపై ప్రేమా, వాత్సల్యాలు పెంపొందుతాయి. రాజకీయంలో వారికి కార్యకర్తల వల్ల చికాకులు తప్పవు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి.

మకరం

నిరుద్యోగ, వివాహ యత్నాలు ఫలిస్తాయి. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. పాతమొండి బాకీలు వసూలు అవుతాయి. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం కోసం ధనం విరివిగా వ్యయమవుతుంది. ప్రేమికుల మధ్య అపార్ధాలు తొలగిపోతాయి.

కుంభం

ధనాభివృద్ధి కానవచ్చినా ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. రిప్రజెంటివ్‌లకు నెమ్మదిగా మార్పులు కానరాగలవు. చిన్న చిన్న విషయాలలో మానసిక ఆందోళనకు గురవుతారు. సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

మీనం

విద్యార్ధులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానియ వ్యాపారులకు కలసిరాగలదు. మత్స్య, కోళ్ల, గొఱ్ఱెల వ్యాపారస్తులు మెలకువ వహించండి. దుబారా ఖర్చులు అధికమవుతాయి.