నా ఒంటి మీద బట్టలు లేకపోయినా.. ఉన్నట్లే చూశారు: జెన్నీఫర్

238

’నా ఒంటి మీద బట్టలు లేకపోయినా.. నాకు ఇబ్బంది అనిపించలేదు.‘ అంటోంది హోలీవుడ్ నటి జెన్నిఫర్. ఇంతకీ విషయం ఏంటంటే జెన్నిఫర్ నటించిన స్పై థ్రిల్లర్ మూమి గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి.. మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమాలోని ఓ సన్ని వేశంలో జెన్నిఫర్ న్యూడ్ గా కన్పించింది. ఈ సీన్ షూట్ విశేషాలను చెప్పుకొచ్చారు ఆమె.

’డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ నా దగ్గరకొచ్చారు.. చుట్టూ సినిమా టీమ్‌ ఉంది. నేనప్పుడు చేస్తోన్న సీన్‌లో చిన్న కరెక్షన్‌ చెబుతున్నాడు. నేను న్యూడ్ గా ఉన్నా.. నా ఒంటి మీద బట్టలున్నట్టుగానే ఫ్రాన్సిస్ చూశారు.  నేనూ నా ఒంటి మీద బట్టలున్నట్టే భావించాను. చుట్టూ ఉన్నవాళ్లంతా ప్రొఫెషనల్స్‌. నాకేం ఇబ్బంది అనిపించలేదు.’ అని చెప్పుకొచ్చారు.

అలాగే.. సినిమా కథ ప్రకారం, ఆ పాత్ర అప్పుడు న్యూడ్‌గా కనిపించడం అవసరం అనుకున్నాని.. దీంతో నో చెప్పలేదన్నారు. సినిమాల్లో న్యూడ్‌గా కనిపించాలనుకోవడం తన చాయిస్ అన్నారు.  ఆ సన్నివేశంలో ఆ అవసరం ఉందని, చుట్టూ ఉన్నవాళ్లూ కథ గురించే ఆలోచిస్తారనే ఆ సీన్‌ చేసినట్లు తెలిపారు.