నిజంగానే చంద్రబాబుకు ఆ మూడూ.. లేవా?

148

నిజంగానే చంద్రబాబుకు ఆ మూడూ.. లేవా?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆ మూడు లేవట. ఆ మూడు లేని వారు చంద్రబాబు లాగా ఉంటారని బాపట్ల బహిరంగ సభలో తేల్చాశారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆ మూడు తప్పనిసరిగా ఉండాలని చెప్తున్నారు.. ఇంతకీ అవి ఏంటంటే విశ్వసనీయత, విలువులు, నిజాయితీ అట. ఇప్పుడు ఈ మూడింటిపైనే ప్రధానం జనంలో చర్చ జరుగుతోంది.

Image result for ap cm sad face  photos

పైగా సూపర్ స్టార్ మహేష్ బాబు అప్ కమింగ్ మూవీ ’భరత్ అనే నేను‘ టీజర్ లో కూడా మహేష్ మాట్లాడుతూ…. ఇచ్చిన మాట తప్పిన వ్యక్తి.. అసలు మనిషే కాదని అంటాడు. ఇప్పుడు దీనిని ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడికి ఆపాదిస్తున్నారు నెటిజన్లు. నిజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విశ్వసనీయత, విలువులు, నిజాయితీ అనేవి లేవా..? అంటే మరి ఆయనను ముఖ్యమంత్రి ప్రజలు ఎందుకు గెలిపించారని.. కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం నుంచి ఎక్కడ విశ్వసనీయత పాటించారని కొందరు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా.. భవిష్యత్ ఇచ్చిన.. సొంత మామ, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై తన అనుచరులతో చెప్పులు వేయించినప్పుడా? లేదా.. ఎమ్మెల్యేలందరినీ.. తన వైపు తిప్పుకుని.. ఎన్టీఆర్ పక్కన ఎవ్వరూ లేరని అధికార హస్తగతం చేసుకునేటప్పుడు విశ్వసనీయత ఎక్కడ పాటించారని అంటున్నారు.

ఇక విలువల విషయానికి వస్తే.. అటువంటివి చంద్రబాబుకు అస్సలు పడవని కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల్లో డబ్బు, మద్యం సంప్రదాయాన్ని తెచ్చిందే బాబేనని అంటారు.. చాలా మంది సీనియర్ నేతలు. నేతల కొనుగోలు, పార్టీఫిరాయింపుల ప్రోత్సాహాకాలకు ఆద్యుడు ఆయనేనంటారు. వ్యాపారులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. డబ్బు ప్రవాహానికి గేట్లు ఎత్తివేశారని చంద్రబాబుపై విమర్శలున్నాయి. ఇందుకు ఉదాహరణ వైస్సార్ సీపీ ఎమ్మెల్యేలను దాదాపు పాతిక మందిని టీడీపీలో చేర్చుకుని, అందులో నలుగురు మంత్రి పదవులు కేటాయించడమే నంటారు రాజకీయ విశ్లేషకులు.

నిజాయితీ.. ఈ విషయానికొస్తే… తన నీడను తానే నమ్మని చంద్రబాబు నాయుడు నిజాయితీగా ఉంటారా అంటే కాదని అంటున్నారు నెటిజన్లు.. గత ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడిలో కొద్దో గొప్పో నిజాయితీ ఉండేదని ప్రజలు భావించేలా పత్రికలు చేశాయి. కాని ఎన్నికల అనంతరం.. నిజాయితీ అనే మాట.. చంద్రబాబు ఇంటావంట లేవని అర్థమైందని అంటున్నారు..నెటిజన్లు. గత ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా విచ్చలవిడిగా హామీలిచ్చారాయన.

ఆయనపై నమ్మకంతో.. అవి సాధ్యమా, కాదా అనికూడా చూడకుండా.. ప్రజలు ఓట్లేసి గెలిపించారు ప్రజలు.. కాని బాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదనేది.. వాస్తవం. ముఖ్యంగా రైతు రుణమాఫీ పూర్తిగా మాట మార్చేశారు.. నిరుద్యోగ భ్రుతి, కాపులను బీసీల్లో చేర్చడం.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత ఉంటుంది.

మరి జగన్ చెప్పిన.. విశ్వసనీయత, విలువులు, నిజాయితీ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో సాధ్యమేనా?

See Also: 1000 కోట్ల ఆస్తులతో జయాబచ్చన్ రికార్డ్..!