ఆడపిల్లలు జీన్స్, టీషర్టు వేసుకుంటే హిజ్రాలు పుడుతారా..?

215
ఆడపిల్లలు జీన్స్, టీషర్టు వేసుకుంటే హిజ్రాలు పుడుతారా..?
ఆడపిల్లలు జీన్స్, టీషర్టు వేసుకుంటే హిజ్రాలు పుడుతారా..?

ఈ వార్త వినగానే కంగారు పడిపోతున్నారు జనాలు. ముఖ్యంగా లేడీస్ రోజు జీన్స్ తప్ప మరొకటి వేసుకోని వారు తెగ భయపడిపోతున్నారు. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. కేరళలకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి ఈ ప్రకటన చేసి కేరళలలో సంచలనం సృష్టిస్తున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..

కేరళలకు చెందిన రంజిత్ కుమార్ అనే ప్రొపెసర్ ఈ మాట చెప్పారు. సహాజంగా ఆరోగ్య చైతన్య పాఠాలు చెప్పే ఈయన ఆడవాళ్ల డ్రెస్సింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పద్దతిగా చీరలు కట్టుకుని ఆడపిల్లలుగా ఉన్న వాళ్లకు మాత్రమే ఆరోగ్యకరమైన పిల్లలు పుడుతారని ఈయన అన్నారు. దీంతో ప్రొపెసర్ మాటలు నీచంగా ఉన్నాయని ట్రాన్స్ జెండర్లను అవమానిస్తున్నట్లుగా ఉన్నాయని కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు రెఢీ అవుతుంది.

స్త్రీలు జీన్స్ ధరించి తమ స్త్రీత్వాన్ని దిగజార్చుకోవడమే లాంటి మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ప్రొపెసర్ 7 నిమిషాల వీడియో పోస్టు చేస్తూ, నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారని… కేరళలో పుట్టే ప్రతి పిల్లాడు ఆరోగ్యంగా పుట్టాలని, అలాగే పెరగాలని కోరుకోవడం తప్పా..? 4 గంటలపాటు షో నడిస్తే, అందులో కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించే కొన్ని పాయింట్లే ప్రసారం చేశారు… అంటూ ఎదురుదాడికి దిగాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.