అడ్డంగా దొరికిపోయిన పవన్ కళ్యాణ్.. ఆ రెండు ఎకరాల గుట్టు ఇదే..?

669

అడ్డంగా దొరికిపోయిన పవన్ కళ్యాణ్..

జనసేన అదినేత పవర్ స్ఠార్ పవన్ కళ్యాణ్.. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక పద్దతితో కూడిన రాజకీయాలు చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఫ్యాకేజ్ పవన్ గా పేరు ఉన్నా.. తాను అలాంటి వాడిని కాదని చెప్పుకొచ్చారు.ఆయా సందర్బంలో తన వద్ద డబ్బులు లేవని అలా ఉండి ఉంటే.. ఈ ఎన్నో చేసేవాడినని చెప్పుకొస్తుంటారు. అలాంటి పవన్ ఎన్ని చెప్పినా ఆయన మీద విమర్శలు ఆగటం లేదు.

రాజధానిలో పవన్ రెండు ఎకరాల్లో ఇల్లునిర్మిస్తున్నారు. ఆ భూమి చంద్రబాబు ఇచ్చాడన్న వార్త బయటకి వచ్చింది. ఈ విషయాన్ని పవన్ ని అడిగితే.. నాకు చంద్రబాబు సహాయం చేస్తే.. జగన్ కి మోడీ చేస్తున్నారా అంటూ ఘాటుగా స్పందించారు. అయితే ఆ ల్యాండ్ మాత్రం తన అభిమానులు ఇచ్చిందని, అవన్నీ చెప్పాల్సిన పని లేదని కొట్టిపారేశారు.ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ భూమికి సంబంధించిన కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి.

See Also: రామ్ చరణ్ కు తగ్గేదే లేదు..ఎన్టీఆర్

తను ఇల్లు కడుతున్న రెండు ఎకరాలు ఎవరిదో కాదు , ముఖ్యమంత్రి చంద్రబాబుకి కరకట్ట మీద ఉండటానికి బహుమతిగా ఇచ్చిన లింగమనేని గెస్ట్ హౌస్ యజమానే పవన్ కళ్యాణ్ కి కూడా రెండు ఎకరాలు ఇచ్చాడంటున్నారు .

కరకట్ట అధినేత పవన్ కళ్యాణ్ కి రెండు ఎకరాలు కలిపి 40 లక్షలకి అమ్మినట్లు రిజిస్ట్రేషన్ చేయించారట. .ఇక్కడ గజం 45 వేల నుండి 50 వేల వరకు ఉంది . అంటే ఎకరం షుమారుగా 25 కోట్లు ఉంది . రెండు ఎకరాలు 50 కోట్లు విలువ చేస్తుంది . అక్కడ ఉన్న స్థలాలన్నీ టీడీపీకి సంబంధించినవే అన్న ప్రచారం సాగుతుంది. 50 కోట్లు విలువ చేసే స్థలం కేవలం 40 లక్షలకే అమ్మారు అంట .ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతుంది.