బీసీలపై రెడ్లు దాడులు చేస్తున్నారా.. కేసీఆర్ స్కెచ్ ఏంటి..

133
బీసీలపై రెడ్డు దాడులు చేస్తున్నారా.. కేసీఆర్ స్కెచ్ ఏంటి..
బీసీలపై రెడ్డు దాడులు చేస్తున్నారా.. కేసీఆర్ స్కెచ్ ఏంటి..

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. కోటి రతనాలవీణగా మార్చుకుంటామని, బంగారు తెలంగాణగా చేసుకుంటామని కేసీఆర్ మూడు కోట్ల ప్రజానికి చెప్పుకున్నారు. అందుకోసమే నా జీవితం అంటూ.. ప్రచారం చేసుకున్నారు. అయితే మారుతున్న కాలం.. ఎన్నికలు దగ్గరవుతున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు ముదురుతున్నాయి. దీంతో కేసీఆర్ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయి. ప్రజల్లోకి కేసీఆర్ చేస్తున్న పనులను తెలిసేలా ప్రచారాలు చేపడుతున్నారు. మూడేళ్ల పాటు కేసీఆర్ పాలన దగదగా మెరిపించినట్లే కనిపించింది. జర్నలిస్టులు,మేదావులు, కవులు.. చాలామంది ప్రభుత్వ పక్షాన చేరిపోవడం వల్ల.. బహుశా ఆ మూడేళ్లలో అసలు సమస్యలే లేవా? అన్నట్లు తయారైంది పరిస్థితి. కానీ 2017లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏడాది ఆరంభం నుంచే ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది.

అది మంథని మధుకర్ ఘటన కావచ్చు, నేరెళ్ల కావచ్చు.. బతుకమ్మ చీరలు కావచ్చు.. ప్రజలంతా ప్రభుత్వంపై గట్టిగా తిరగబడ్డారు. మరోవైపు విద్యార్థులు నిరంతరం ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం తర్వాత మరోసారి ఉవ్వెత్తున ఈ నిరసనలు ఎగిసిపడ్డాయి. ‘మూడెకరాలు ఇస్తానని.. ఆరెకరాలు ఇస్తివా’ అని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోను జేఎన్‌యూ విద్యార్థులు ఇదే నినాదాన్ని మార్మోగించారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఈ నినాదం చాలా పాపులరైంది. ఏదేమైనా వీటితే టీఆర్ఎస్ ప్రతిష్టకు గట్టి దెబ్బే తగిలింది.

వీటితో పాటు తాజాగా టీఆర్ఎస్ పార్టీ మరో వివాదంలో ఇరుక్కుంది. త్వరలో తెలంగాణలోకి వెల్ కమ్ పార్టీ ఆరంభిస్తారన్న విమర్శలు వెల్లువెత్తాయి. వెల్ కమ్ పేరుతో వెలమ-కమ్మ సామాజిక వర్గాల కలయికకు బాటలు వేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు చాలానే ప్రచారం జరిగింది. రెడ్లపై ప్రతికూల అభిప్రాయం కలిగేలా టీవి చానెల్లో ఒక ప్రీ-ప్లాన్డ్ డిబేట్ నిర్వహించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రెడ్ల నుంచి వ్యతిరేత వచ్చింది. కేసీఆర్ తీరు చాలా మంది దుయ్యబట్టారు. ఆ వెంటనే తేరుకున్న కేసీఆర్ రెడ్లను పొగుడుతూ ప్రసంగాలు చేశారు. అయినప్పటికీ ఆ డిబేట్ ప్రభావం రెడ్లకు రుచించలేదు. టీఆర్ఎస్ కావాలనే చేసిందన్న పొలిటికల్ డ్రామన్న మాట వినిపించింది.

దీంతో మరో సారి అసెంభ్లీలో కోమటి రెడ్డి చేసిన దాడితో రెడ్ల వివాదం తెరపైకి తెచ్చింది. కోమటి రెడ్డి చేసిన మైక్ దాడిని రెడ్లు బీసీలపై చేసిన దాడిలా కనిపిస్తుందన్న వాదన వినిపిస్తుంది. గతంలో విఫలం అయిన కేసీఆర్ ప్రయత్నాలు ఈ దాడితో కావాలని మళ్లీ తెరపైకి తెస్తున్నారని కొందరు కాంగ్రెస్ నేతలు తెరపైకి తెస్తున్నారు. అందుకే టీఆర్ఎస్ చిన్న గాయానికి ఆపరేషన్ అదీ ఇదీ అంటూ రాద్దాంతం చేస్తున్నారని, దానిని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అక్కడ ఆవేశంలో ఏదో చిన్న పొరపాటు జరిగితే.. దాని క్యాష్ చేసుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నింస్తుందని, దానిని కులాల గొడవగా కేసీఆర్ సృష్టిస్తున్నారని అంటున్నారు. ఇది ఖచ్చితంగా రెడ్లను తక్కువ చేయడానికి బీసీలపై దాడిగా టీఆర్ఎస్ అభివర్ణిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.