ఊర్లు బాగుచేద్దాం.. దేశాన్ని తీర్చిదిద్దుమనే ఆ డైరెక్టర్ ఎవరు..?

0

ఈ మధ్య తెలుగు హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ గురించి బాహాటంగా మీడియాకు ఎక్కుతున్నారు. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే నిర్మాత, డైరెక్టర్ లాంటి వారి కోరికలు తీర్చాలని అప్పుడే అవకాశాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ లిస్టులో మరో హీరోయిన్ చేరారు. అందులో శ్రీరెడ్డి గత రెండు రోజులుగా మీడియాలో రచ్చ లేపుతుంది. అవకాశాలు రావటం లేదంటూ.. కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో మీడియాలో అలాగే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది శ్రీరెడ్డి ఇంటర్వ్యూ..ఈమే మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రెచ్చిపోయింది.

see also:ర్తవ్యం మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

 

ఇంతకూ ముందు కూడా చాల మంది హీరోయిన్స్ ఇలాగె కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు కాని అప్పుడు అది అంతగా హైలేట్ అవ్వలేదు కాని శ్రీరెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా పక్కలో పడుకుంటేనే ఆఫర్ వస్తుంది అంటూ సంచలనం రేపింది శ్రీరెడ్డి. ఇక అంతటితో ఆగకుండా ఆమె మరో అడుగు మందుకు వేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా జరగడానికి తప్పు మొత్తం డైరెక్టర్స్ డే అంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ మొత్తం నలుగురు చేతుల్లో మాత్రమే ఉందని ఆ నలుగురు బయటకి వచ్చి న్యాయం చేస్తే తప్ప టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి మారదు అని ఆమె తెలిపారు. ఇక శ్రీరెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగానే ఒక న్యూస్ ఛానెల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్లో ప్రముఖ దర్శకుడు దొరికిపోయారు.

కాస్టింగ్ కౌచ్ లో కో ఆర్డినేటర్లదే కీలకపాత్ర అంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ,న్యూస్ ఛానెల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ లో కో ఆర్టినేటర్ ఛాంద్ ఖాన్ చిక్కుకున్నారు. ఇక ఈ సంభాషణ అంతటితో ఆగకుండా ఆమె మరో పని చేసింది అతనితో జరిగిన వాట్స్ అప్ చాట్ మొత్తం కూడా బట్టబయలు చేసింది. ఇక ఇదే నేపధ్యంలో మరో దర్శకుడి బాగోతం కూడా బయటపెట్టింది. కాని ఆమె తెలివిగా అతని పేరు బయటకి చెప్పకుండా కొంచెం అంటే కొంచెం క్లూ ఇచ్చి వదిలేసింది. అదేంటి అంటే ఊర్లు బాగుచేద్దాం.. దేశాన్ని తీర్చిదిద్దుదాం అంటూ ఆ డైరెక్టర్ అంటారని చెప్పింది. దీంతో ఆ డైరెక్టర్ ఎవరన్నదానిపై సోషల్ మీడియాలో వేట మొదలైంది.