OMG : వయాగ్ర నీళ్లు తాగిన 80వేల గొర్రెలు.. ఆ తర్వాత ఏమైంది

220

వయాగ్ర.. ఈ పేరు వింటే చాలు సెక్స్ అని గుర్తుకొస్తుంది.. కొత్త శక్తి పుట్టుకొస్తుంది. మనుషులు అయితే ఓకే.. అదే పశువులు వయాగ్ర కలిపిన నీళ్లు తాగితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఐర్లాండ్ లో క్లారిటీకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఐర్లాండ్ లోని రింగాస్కిడ్జి నౌకాశ్రయం. ఆ ప్రాంతంలోని ఓ చెరువులో గొర్రెలు నీళ్లు తాగాయి. చుట్టుపక్కల 20 గ్రామాలకు చెందిన 80వేల గొర్రెలు రోజువారీ మేతలో భాగంగా అక్కడికి వచ్చి నీళ్లు తాగాయి. ఆ తర్వాతే అసలు మేటర్ స్టార్ట్ అయ్యింది.

ఈ చెరువులోని నీళ్లు తాగిన గొర్రెలు వింతగా ప్రవర్తించాయి. సెక్స్ కోసం ఆరాటపడ్డాయి. విపరీతంగా సెక్స్ చేశాయి. ఇది చూసిన గొర్రెల కాపరులు షాక్ అయ్యారు. వింత వింతగా ప్రవర్తించటంతో ఆందోళనపడ్డారు. పశువుల డాక్టర్లను పిలిపించారు. వారు రక్తం, వీర్యకణాలను టెస్ట్ చేశారు. అధిక మోతాదులో వయాగ్రా తీసుకున్నట్లు తేలింది. ఆ తర్వాత విచారణ చేయగా అసలు విషయం బయటపడింది.

చెరువుకు సమీపంలోని ఓ మెడిసిన్ ఫ్యాక్టరీ నుంచి 755 టన్నుల వయాగ్ర మందులు ఈ చెరువు నీటిలో కలిశాయంట. ఈ నీళ్లు తాగటం వల్లే గొర్రెలు సెక్స్ కోసం ఆరాటపడ్డాయి. విపరీతంగా సెక్స్ చేశాయి. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. విషయం తెలిసిన తర్వాత ఈ చెరువు నీటిని ఖాళీ చేసి.. కొత్తగా నీటితో నింపుతున్నారు. గొర్రెలను సాధారణ స్థితికి తీసుకురావటానికి డాక్టర్లు కష్టపడుతున్నారు.

మగ గొర్రెలు సరే.. ఆడ గొర్రెలకు ఎంత కష్టం వచ్చిందో పాపం…