ఏ అమ్మాయిని చూసినా ఆపుకోలేక పోతున్నాను, రోజులో మూడుసార్లు చేస్తున్నాను… నీరసంగా అనిపిస్తోంది..!

31

డాక్టర్ గారు… సార్, నా పేరు సూర్య(22) . మాది కృష్ణా జిల్లా మచిలీ పట్నం. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాను. మా క్లాస్ లోని అమ్మాయిలను చూస్తే.. నాలో కోరికలు పెరిగిపోతున్నాయి. వారి వక్షోజాలను, పిరదులను అదే పనిగా చూడాలని అనిపిస్తుంది. అప్పుడు అంగం బలంగా తయారవుతుంది. ఇక ఆపుకోలేక బ్రేక్ టైంలో కాలేజీలోని బాత్రూమ్ కి వెళ్లి హస్త ప్రయోగం చేసుకుని తృప్తి చెందుతాను. కొన్నిసార్లు మొబైల్ ఫోన్ లో పోర్న్ మూవీస్ చూస్తూ… వరుసగా రెండు, మూడు సార్లు చేసేస్తాను. అలాగే ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో కూడా రోజూ హస్త ప్రయోగం చేస్తున్నాను. హస్త ప్రయోగం చేసిన తర్వాత నాకు కొంచెం నీరసంగా ఉన్నట్లు అనిపిస్తోంది. వెంటనే ఏదో ఒకటి తినేస్తున్నాను. ఈ మధ్య ఓ పుస్తకం చదువుతుంటే.. హస్త ప్రయోగం చేయడం వల్ల పిల్లలు పుట్టరని, శక్తి అంతా తగ్గిపోయి బలహీనంగా తయారవుతారని రాసుంది. అది చదివినప్పటి నుంచి నాలో భయం మొదలైంది. కానీ, హస్త ప్రయోగం మాత్రం చేయకుండా ఉండలేకుపోతున్నాను. నాకు మరో పత్యామ్నాయం లేదు. హస్త ప్రయోగం చేస్తే.. నిజంగానే బరువు తగ్గుతారా? రో్జుకు ఎన్నిసార్లు చేస్తే ఆరోగ్యంగా ఉంటాం? దీనివల్ల భవిష్యత్ లో ఏమైన ప్రభావం ఉంటుందా?…..

డాక్టర్ సమాధానం….

     చూడు సూర్య.. నీ వయస్సులో కోరికలు కలడం అనేది సర్వసాధారాణం. పరుగులు పెడుతున్న నదిలా యుక్తవయస్సులో కామ వాంఛలు అధికంగా ఉంటాయి. చూసిన ప్రతీ అమ్మాయితో రతిలో పాల్గొనాలని అనిపిస్తుంది. కానీ, ఇలాంటి వయస్సులో జాగ్రత్తగా ఉండాలి. హస్త ప్రయోగం చేయడం వల్ల నీకు వచ్చే నష్టం ఏమీ లేదు.  ముఖ్యంగా రోజుకు మూడు, నాలుగు సార్లు హస్తప్రయోగం చేసినా బరువు తగ్గడం లాంటివి ఉండదు. కానీ, మరీ నరాలు దెబ్బతినేంతాల హస్తప్రయోగం చేయకు.

ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే… వీర్యం అంత విలువైనది కాదు అనే విషయాన్ని ముందు తెలుసుకో. వీర్యం ఎక్కువుగా పడిపోవడం వల్ల బరువు తగ్గిపోతారు… బక్కగా అయిపోతారు… లాంటి అపోహలను పక్కన పెట్టు. ముఖ్యంగా నీలాంటి యువకులు.. వీర్యం అతిశక్తివంతమైన పదార్థం అని, మనం తినే ఆహారంలో శక్తివంతమైన లేదా సారవంతమైన పదార్థం వీర్యం అవుతుందని భావిస్తుంటారు. ముఖ్యంగా వంద రక్తపు బొట్లు కలిపితే ఒక వీర్యం బొట్టు అవుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ, ఇవన్నీ అశాస్త్రీయమైన ఆలోచనలే…

 మగవారి వృషణాలలో వీర్యం తయారవుతుంది. అది శుక్రకోశాల్లో నిల్వ ఉంటుంది. ఇక్కడ వీర్య కణాలు బతికేందుకు ఒక ద్రవ పదార్థం ఉత్పన్నమవుతుంది. అంటే చేప బతికేందుకు నీరు ఎలా అవసరమో వీర్యకణాల జీవించేందుకు ఈ ద్రవ పదార్థం అలా అన్నమాట. ఇందులో ప్రక్టోజ్ ఉంటుంది. అంటే ఇది గ్లూకోజ్ లాంటింది. అలాగే కొన్ని విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. మనలో సెక్స్ కోరికలు పెరిగిపోయినప్పుడు, సెక్స్ లో పాల్గొన్నా.. లేదా హస్త ప్రయోగం చేసినా.. శుక్రకోశాలు ముడుచుకుంటాయి. ఈ క్రమంలో ప్రోస్టేట్ గ్రంథి నొక్కడం వల్ల ఒక్కసారి కొంత ద్రవం చివ్వున ఒక్కసారిగా బయటకు వెదజల్లుతుంది. ఇందులో 5శాతం వీర్యకణాలు ఉంటే… 95శాతం ద్రవ పదార్థం ఉంటుంది.  ఈ ద్రవం పోయినంత మాత్రానా.. పురుషుడు ఏమాత్రం బరువు తగ్గడు. బలహీనం కాడు.. కాబట్టి వీర్యం పోవడం వల్ల ఎలాంటి నష్టాలు రావు. అయితే ఒక చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకో… ఏది కూడా శృతి మించితే మంచిది కాదు…