మీ ఇంట్లో పిల్లలున్నారా… వారి ఆరోగ్యం పై ఆందోళన ఉందా…

77

చిన్నారుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు ఇప్పుడు కాస్త ఉపశమనం కలిగి నట్లే.. “ఫిట్ బిట్ కంపెనీ” ‘ఫిట్ బిట్ ఏస్’ పేరుతో గతంలో అమెరికాలో లాంచ్ చేసింది. ఇది ఓ వాచ్ లాగా పని చేస్తుంది.. ఇప్పుడది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినట్టు కంపెనీ ప్రకటించింది. దీని ధర 99.95 డాలర్లు. మన కరెన్సీలో రూ.6,500. ఉంటుందట.. అతి త్వరలో మన దేశంలోకి రానున్నది..

ఈ కంపెనీ దీన్ని 8 సంవత్సరాలు, ఆపై వయసున్న చిన్నారుల కోసం ఉద్దేశించినదిని. ప్రతి గంటకోసారి వారికి రిమైండర్లను పంపుతూ వారి యాక్టివిటీని ట్రాక్ చేస్తుంది. ఇందులో చిన్నారులకు పోటీలు కూడా ఉంటాయి. చిన్నారుల చేతికి పెట్టి, మొబైల్ ఫోన్లో ఫిట్ బిట్ యాప్ కు కనెక్ట్ చేసుకోవాలి. ఈ పరికరం ద్వారా… పిల్లల నిద్ర తీరును రికార్డ్ చేసి తగినంత నిద్ర పోతున్నారా, లేదా అని చెబుతుంది. ఎన్ని కేలరీల ఆహారం తీసుకున్నారు, బరువు, బాడీ ఫ్యాట్, బీఎంఐ వివరాలు కూడా తెలుసుకోవచ్చు.