“ఫ్లిప్ కార్ట్” నుండి ‘ద బిగ్ బిలియన్ డే సేల్’ త్వరలో….!

8

ఈ కామర్స్ రంగంలో దిగ్గజ సంస్థగా ఎదిగి ఆన్ లైన్ మార్కెట్ రంగంలో సత్తా చాటుకుంటున్న ఫ్లిప్ కార్ట్ తన సంస్థ నుండి త్వరలోనే ‘ద బిగ్ బిలియన్ డే సేల్’ నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. ఈ సందర్బంగా ఇందుకు సంబందించిన ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఈ జేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులపే అత్యదికంగా ఆపర్ ఉండనున్నట్లు తెలిపింది. కానీ ఈ ఆఫర్ ఎప్పటి నుండి వర్తిస్తుందనే అంశాని మాత్రం వెల్లడించలేదు. పండగ సీజన్ సందర్భంగా త్వరలోనే ఈ సేల్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

కాగా ఈ సేల్ లో హెచ్ డి ఎఫ్ సి బ్యాంకులకు సంబందించిని డెబిట్, క్రెడిట్ కార్డులపై వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్లను అందించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం హెచ్ డి ఎఫ్ సీ బ్యాంక్ కార్డులను మాత్రమే ఈ ఆఫర్ లో వర్తిస్థాయని చెప్పినప్పటికి ఒతర కార్డులు కూడా త్వరలో ప్రకటించనుందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా దసరా పండుగ సందర్బంగా ఈ ఆఫర్ ఉండవచ్చునని కూడా వారు తెలుపుతున్నారు.