TV5 యాంకర్ సౌజన్య V6లో చేరింది

117

టీవీ5 ఛానల్ లో పని చేస్తున్న యాంకర్ సౌజన్య ఆ సంస్థకు రాజీనామా చేసింది. వీ6 న్యూస్ ఛానల్ లో జాయిన్ అయ్యింది. అతి త్వరలోనే స్క్రీన్ పై కూడా కనిపించనుంది. మోస్ట్ సీనియర్ యాంకర్ అయిన ఈమెను అక్కడ ఎలాంటి ప్రొగ్రామ్ ఇస్తారు అనేది సస్పెన్స్. ఎందుకంటే ఇప్పటికే సీనియర్ యాంకర్లు చాలా మంది వీ6లో ఉన్నారు. వాళ్లందరూ న్యూస్ అండ్ ప్రొగ్రామ్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్లతో కెరీర్ స్టార్ట్ చేసిన సౌజన్య మాత్రం కొంచెం డిఫరెంట్ గా కెరీర్ ను చక్కదిద్దుకుంది. డిస్కషన్స్, డిబేట్స్, లైవ్ షోలతో సీనియర్ గా ప్రొమోట్ చేసుకోగలిగింది.

టీవీ5లో ప్రయార్టీ బాగానే ఉంది అనే టాక్ కూడా వినిపిస్తోంది. అలాంటి సౌజన్య.. ఆ సంస్థను వదిలి వీ6లో జాయిన్ కావటం విశేషం. రేటింగ్ లో పడిపోతున్న వీ6 న్యూస్ ఛానల్ ను సౌజన్య ఏమైనా హెల్ప్ అవుతుందో లేదో చూడాలి. టీవీ5కి రాజీనామా వెనక యాజమాన్యం వైఖరి ఏమైనా ఉందా లేక వ్యక్తిగత కారణాలా లేక మంచి ప్యాకేజీనా అనేది తెలియాల్సి ఉంది.