అల వైకుంఠపురం చూస్తుంటే.. ఇలా ఆర్య గుర్తొచ్చాడే

44

ఒక సినిమా టీజర్ చూస్తుంటే మరో సినిమాలోని డ్రస్, హెయిర్ స్టయిల్, హావభావాలు గుర్తుకొస్తున్నాయి అంటే ఆ సినిమా జనంలో అంతలా ముద్ర వేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా బన్నీ లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురంలో.. 11వ తేదీ సాయంత్రం టీజర్ రిలీజ్ అంటూ విడుదల చేసిన కొన్ని సెకన్ల వీడియో యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది కానీ.. జనం మైండ్ లో మాత్రం మరో మూవీ గుర్తుకొచ్చింది.

అల వైకుంఠపురం టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ లో కొన్ని షాట్స్ రిలీజ్ అయ్యాయి. బన్నీ డ్రస్, లిఫ్ట్ లో ఉండి చేతిలో బ్లేజర్ పట్టుకుని ఉండటం.. మీటింగ్ హాల్ లో టేబుల్ నడుస్తూ ఉండటాన్ని బూట్ల వరకు చూపించటం చూస్తుంటే పెద్దగా ఇంప్రెస్ ఏమీ లేకపోగా ఎక్కడో ఏదో తంతుంది కదా అనే ఫీలింగ్ ఫ్యాన్స్ లోనూ రావటం విశేషం. ఆర్య 2 మూవీలో ఆఫీసులోకి ఎంట్రీ సమయంలోనూ ఇలాంటీ సీన్ ఉంటుంది. ఆ మూవీ చూసినోళ్లకు.. ఈ టీజర్ చూడగానే అదే గుర్తుకొస్తుండటం కామన్ కదా..

త్రివిక్రమ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీకి హైప్ ఉన్నా.. టీజర్లు, ట్రైలర్లు చూస్తుంటే మాత్రం ఎక్కడో ఏదో పాత మూవీకి కనెక్ట్ అవుతున్నారు సినీ ప్రేక్షకులు. ఇప్పటికే వచ్చిన కొన్ని డైలాగ్స్ కూడా జులాయి, జల్సా సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ కు కొనసాగింపుగా అనిపించటం విశేషం.

అంతా వైకుంఠనాధుడి దయ ఎలా ఉంటుందో జనవరి 12న సంక్రాంతికి చెప్పేయనున్నారు జనం..