తెలుగు ఇండస్ట్రీలో పడుకుంటేనే పనవుతుంది: నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

232
Srireddy

శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

క్యాస్టింగ్ కౌచ్ టాలివుట్ నుంచి హాలివుడ్ వరకు ఒక కుదుపు కుదిపేస్తోంది. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై ఇప్పటికే అనేక మంది హీరోయిన్లు ఇప్పుడిప్పుడే పెదవి విప్పుతున్నారు. ఇప్పటికే అర్చన, కస్తూరి, గాయత్రి గుప్తా, మాధవీలత ఇలా చాలా మంది హీరోయిన్లు, బుల్లితెర నటులు తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లు కావాలనుకుంటే ఖచ్ఛితంగా అన్నింటికీ సిద్ధపడి రావాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఇక ప్రముఖ నటి రాధికే ఆప్టే అయితే తెలుగు సినిమాల్లో నటించనని తెగేసి చెప్పేసింది. అయితే ప్రస్తుతం నటి శ్రీరెడ్డి వ్యాఖ్యలు.. సంచలనంగా మారాయి. ఓ ఇంటర్వ్యూలో తెలుగు హీరోలు, నిర్మాతల వ్యవహార శైలీపై ఆమె తీవ్రంగా స్పందించారు.

శ్రీరెడ్డి గా పరిచయం ఉన్న విమల మల్లిడి జిందగీ, నేను నాన్న అబద్దం, అరవింద్ 2 సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా దూసుకుపోతున్న ఎంతో పడుకుని పైకొచ్చిన వాళ్లేనని.. వాళ్లలో చాలా మంది తనకు తెలసునన్నారు. హీరోయిన్లుగా అవ్వాలనుకునే వారు అన్నింటికీ సిద్ధపడే రావాలని, ఒక వేళ వచ్చినా.. అవకాశాలు రాక లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ మిగిలిపోవాల్సిందేనన్నారు.

ఏ తెలుగింటి అమ్మాయిని వారి తల్లిదండ్రులు బయటకు పంపడానికి కూడా ఆలోచిస్తారని.. క్యాస్టింగ్ కౌచ్ వల్లే చిత్ర పరిశ్రమకు వారు పంపడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా కష్టపడి.. అన్నింటికీ సిద్ధపడి అవకాశాల కోసం కడుపు మాడ్చుకుని బాడీ మెయిన్ టేనెన్స్ చేస్తుంటే ఎందుకు తెలుగు అమ్మాయిలకి అవకాశం ఇవ్వరంటూ తీవ్రంగా స్పందించారు.
అందరికీ ముంబై, మళయాలీ అమ్మాయిలే కావాలా.. తెలుగు అమ్మాయి అక్కర్లేదా అంటూ కొందరు హీరోల పేర్లు కూడా ప్రస్తావించారు. అలాగే మోహన్ బాబు , అల్లు అరవింద్ లాంటి వాళ్లను కూడా కడిగి పారేసింది… తెలుగు గురించి లెక్చర్లు ఇచ్చే పవన్ కల్యాణ్ తన సినిమాల్లో ఎందుకు తెలుగు హీరోయిన్లను తీసుకోరని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ ను తీసుకోవాలని, అప్పుడే మాలాంటి వారు కూడా బతుకుతారని ఆవేదన వ్యక్తం చేశారు.