థియేటర్ల బంద్ వల్ల సాధించిందేమిటీ? మార్చి 16 నుంచి షూటింగ్ లు బంద్

58

డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లు చార్జీలు తగ్గించాలని దక్షిణాది చిత్ర పరిశ్రమ ఈ నెల 2వ తేదీ నుంచి థియేటర్ల బంద్ చేపట్టింది. మళ్లీ గత శుక్రవారం నుంచి థియేటర్లలో యాథావిధిగా సినిమాలు ప్రదర్శిస్తున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో (ఆంధ్రా, తెలంగాణ, కేరళ, కర్ణాటక, కేరళ ) ఈ బంద్ పాటించిన సంగతి తెలిసిందే.

కాని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా బంద్ కొనసాగిస్తున్నారు.  ఏడు రోజుల బంద్ అనంతరం సాధించింది ఏమిటంటే.. డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లు రూ.2వేలు మాత్రమే చార్జీలు తగ్గించారట. అయితే ప్రచారచిత్రాల ప్రదర్శన విషయంలో న్యాయం జరిగలేదనేది నిర్మాత,దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి వంటి వారి వాదన. కేవలం 2వేలకు చిత్రాలు ప్రదర్శించే డిజిటల్ కంపెనీలున్నా.. వాటిని రానివ్వకుండా గుప్తాధిపత్యం చలాయిస్తున్న కొన్నికంపెనీలు అడ్డు పడుతున్నాయనేది విమర్శ. దీంతో క్యూబ్ వంటి డిజిటల్ ప్రొవైడర్ సంస్థలో భాగస్వామిగా ఉన్న ఓ బడా తెలుగు నిర్మాతే ఇందుకు కారణం అని విమర్శలు వినిపిస్తున్నాయి.

వేసవిలో పెద్ద సినిమాల తాకిడికి చిన్న సినిమాలు నిలబడలేవు కనుక మార్చిలో చిన్న సిినిమాలు విడుదల చేసుకుందామనుకుంటే.. బంద్ పేరుతో అడ్డుకున్నారని కొందరు చిన్న నిర్మాతలు పెదవి విరుస్తున్నారు. దురుద్దేశంతోనే బంద్ చేశారని దాని వల్ల ఒరింగేదేమి లేదంటున్నారు.

మార్చి 16 నుంచి షూటింగ్ లు బంద్

అయితే తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మాత్రం బంద్ ను మరింత ఉధ్రుతం చేయనుంది. మార్చి 16 నుంచి షూటింగ్లు, ఫోస్ట్ ప్రొడక్షన్లు, కొత్త సినిమాల విడుదలను కూడా పూర్తి నిలిపివేయనుంది. ప్రధానంగా ఆరు డిమాండ్లతో టీఎఫ్ పీసీ ఆందోళనలు కొనసాగించనుంది. క్యూబ్, యూఎఫ్ ఓలు వర్చువల్ ప్రింట్ ఫీజు వసూలు చేయకూడదు. ఆనలైన్ బుకింగ్ చార్జీలను తగ్గించాలి, టికెట్ ధరలను సరళీకరించాలి, చిన్న సినిమాలకు తగిన థియేటర్లు ఉండేలా చూడాలి, అన్ని థియేటర్ల లోని టికెక్కట్లను కంప్యూటర్ చేయాలి, ప్రొడక్షన్ వ్యయాన్ని తగ్గించాలనేది ప్రధాన డిమాండ్లు. అలాగే సినిమా టిక్కెట్ల ధరలు నిర్ణయించే అధికారం కేవలం నిర్మాతలకు మాత్రమే ఉందని, థియేటర్ల యజమానులకు లేదని టీఎఫ్ పీసీ పేర్కొంది.