త్వరలో తెలుగు తెరపై ఘంటసాల బయోపిక్…

0

తన స్వరంతో సాటకు ప్రాణం పోసిన ప్రముఖ గాయకుడు ఘంటసాల గారు. పాటేదైనా సరే తన మధురు గానం తో ప్రేక్షకులన్ని ఆకట్టుకున్నాడు. “మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.. ” అన్నా పాతాళబైరవి చిత్రంలో ఎంతఘాటు ప్రేమ, ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు వంటి పాటలతో నేటికి మనకు వినిపిస్తూనే ఉంటాయి.. అలాంటి పాటలు పాడిన సింగర్ ఘంటసాల తన జీవితంలో అనేక ఆటు పోట్లను ఎదుర్కోన్నాడు.. ఆయన జీవితం ప్రస్తుతం తెరపైకి తీసుకు రావటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

అలనాటి అగ్ర కథానాయకులకే కాదు భాస్యనటులకు కూడా పాటలు పాడారు, బానీలు అందించారు. కాగా తన కెరియర్ మొదట్లో తను సంగీతం నేర్చుకునే రోజుల్లో “జోలె పట్టి ఇంటింటికి తిరిగి తన ఆకలి తీర్చుకున్నారు”. తనకున్న మక్కువతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి ఘంటసాల జీవితచరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఘంటసాల జీవితచరిత్రపై పరిశోధన చేసిన సీహెచ్ రామారావు, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో ఘంటసాల పాత్రను సింగర్ కృష్ణ చైతన్న పోషిస్తున్నట్లు ఫిలింనగర్ లో ఓ టాక్ వినిపిస్తోంది. కాగా ఇంత వరకు ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వెలుపడలేదు. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే మరి కొద్దిరోజులు ఎదురు చూడాల్సి ఉంది.