ఆ హీరో పై మనసు పారేసుకున్న బాలీవుడ్ బ్యూటీ

44
kritih sanon actress

సాధారణంగా ఒక సినిమాలో కలిసి పనిచేసిన హీరో , హీరోయిన్లు కాస్త క్లోజ్ గా ఉండటం సహజమే.. అలా వారు కలిసి ఎక్కడన్నా కనిపిస్తే ఇంకా మీడియా వాళ్ళు ఆగుతారా. ఆ హీరోతో ఈ హీరోయిన్ అక్కడ దొరికింది అంటూ పదే పదే చూపిస్తారు. దానితో సినిమాల కన్నా ఎక్కువగా గాసిప్స్ తో బాగా పాపులర్ అవుతుంటారు. అసలు విషయానికొస్తే.. “బోణి’ సినిమాతో తెలుగు సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తీన్ మార్, రామ్ తో ఒంగోలు గిత్త సినిమాలలో నటించింది. ఈ సినిమాలు ఓ మాదిరిగా ఆడటంతో బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ అలవాట్లను వంటపట్టించుకున్న

ఈ అమ్మడు ఆ తర్వాత నటిస్తున్న సినిమాలలో బోల్డ్ గా నటిస్తూ వస్తుంది. బాలీవుడ్‌ నటుడు పుల్‌కిత్‌ సామ్రాట్‌తో ఆమె ప్రేమలో ఉందంటూ గత కొన్నిరోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే పుల్‌కిత్‌ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని గ‌తంలో చెప్పిన కృతి.. తాజాగా అత‌డితో ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకోవ‌డం విశేషం. అతడితో సహజీవనం కూడా చేస్తుందనే వార్తలు వినపడుతున్నాయి. ప్రేమ వ్యవహారం బయట పడింది. ఇంకా పెళ్లి తంతు ఎప్పుడుంటుందో చూడాలి..