డ్రైవింగ్ లైసెన్స్ రద్దయిన హీరో రాజశేఖర్.. కారు ఎలా నడుపుతారు?

435
how rajsekhar can drive car whiile his licence was cancelled

ఓ యాక్సిడెంట్ తో తన డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసుకున్నారు హీరో రాజశేఖర్. అలాంటి ఆయన కారు ఎలా నడుపుతారు.. డ్రైవింగ్ వస్తే చాలా.. లైసెన్స్ అక్కర్లేదా.. హీరో అయితే ఓకేనా.. లైసెన్స్ లేకుండా కారు నడిపిన హీరోకి ఇప్పుడు ఎంత ఫైన్ వేస్తారు ఆర్టీఏ అధికారులు.. ఈ విషయమే ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఇంతకీ హీరో రాజశేఖర్ ఎక్కడ దొరికిపోయారో చూద్దాం…

దిశ కుటుంబ సభ్యులను పరామర్శించటానికి తన భార్య జీవిత, పిల్లలతోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో కలిసి మంగళవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లారు. నివాళులర్పించారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో హీరో రాజశేఖర్ స్వయంగా డ్రైవింగ్ సీట్లో కూర్చుకున్నారు. ఇక్కడే ఇష్యూ అయ్యింది. ఇటీవలే అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయిన వార్త చదివిన అక్కడి విలేకరులు సైతం అవాక్కయ్యారు. ఆర్టీఏ అధికారులు ఈ విజువల్ చూస్తే మాత్రం జరిమానా వేయటం ఖాయం అంటూ గుసగుసలాడుకున్నారు.

అన్నంత పనీ జరిగింది. సోషల్ మీడియాలో ఈ విజువల్, ఫొటోలు పోస్ట్ అయిపోయాయి. పరామర్శించిన వార్తల వెనకే హీరో రాజశేఖర్ డ్రైవింగ్ ఫొటోలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు అధికారులు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి…