ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నివాసంలో.. పెద్ద కోడ‌లు ర‌చ్చ‌..ర‌చ్చ‌..!

0

దివంగ‌త సినీ ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు కుటుంబంలో వివాదం మొద‌లైంది. ఇద్ద‌రు కుమారుల మ‌ధ్య ఆస్తి వివాదం తీవ్ర స్థాయికి చేరింది. త‌న‌ను ఇంట్లోకి రానివ్వాలంటూ.. దాస‌రి నారాయ‌ణ‌రావు పెద్ద కోడ‌లు సోమ‌వారం సాయంత్రం ఇంటిముందు ఆందోళ‌న‌కు దిగారు. పోలీసులు, మ‌హిళా సంఘాల సాయంతో సోమ‌వారం సాయంత్ర ఇంట్లోకి వెళ్లేందుకు య‌త్నించారు. దాస‌రి చిన్న కుమారుడు అరుణ్‌, కోడ‌లు త‌న‌ను అడ్డుకుంటున్నార‌ని సుశీల చెప్పింది.

దాస‌రి నారాయ‌న‌రావు ఇంటి ముందు మీడియాతో మాట్లాడిన సుశీల‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. 1995లో దాస‌రి నారాయ‌ణ‌రావు పెద్ద కుమారుడు ప్ర‌భుకు త‌న‌కు రిజిస్ట‌ర్ మ్యారేజ్ అయిన‌ట్టు ఉన్న స‌ర్టిఫికేట్ల‌ను చూపించింది. అయితే, త‌మ ప్రేమ వివాహాన్ని మొద‌ట్లో దాస‌రి నారాయ‌ణ‌రావు, ఆయ‌న కుటుంబ స‌భ్యులు అంగీక‌రించ‌లేద‌ని, కొన్ని రోజులు గ‌డిచాక  దాస‌రి నారాయ‌ణ‌రావు స‌హా కుటుంబ స‌భ్యులంద‌రూ త‌మ వివాహాన్ని అంగీక‌రించి, త‌మ‌కు విడిగా ఫ్యామిలీ పెట్టుకునేందుకు ఒప్పుకున్నార‌ని చెప్పింది.

మ‌ధ్య‌.. మ‌ధ్య‌లో త‌న భ‌ర్త ప్ర‌భును దాస‌రి నారాయ‌ణ‌రావు కుటుంబ స‌భ్యులు వారి ఇంటికి తీసుకెళ్లి.. త‌న‌తో కాపురం చేయ‌నీకుండా చేశార‌ని, ఒకానొక స‌మ‌యంలో విడాకులను కూడా డిమాండ్ చేశార‌ని సుశీల మీడియాతో చెప్పుకొచ్చింది. అలాగే, ప్ర‌భు వ‌ద్ద‌కు వెళ్లి.. నీ భార్య నిన్ను వ‌ద్దంటుంది.. డ‌బ్బులు డిమాండ్ చేస్తుంది అంటూ చెప్పేవారు. ఇలా ప్ర‌భుకు, త‌న‌కు మ‌ధ్య గొడ‌వ‌లు పెట్టేందుకు దాస‌రి నారాయ‌ణ‌రావు కుటుంబ స‌భ్యులు య‌త్నించార‌ని సుశీల‌ చెప్పింది. అయితే, దాస‌రి నారాయ‌ణ‌రావు మృతి చెందిన‌ప్ప‌ట్నుంచి త‌న‌ను ఇంట్లోకి రానివ్వ‌డం లేదని.. ఆ క్ర‌మంలోనే మ‌హిళా సంఘాలను, పోలీసుల‌ను ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌ని చెప్పింది సుశీల‌.