కొణిదెల ప్రొడక్షన్స్ మూసివేత – రాంచరణ్ నిర్ణయంతో సినీ ఇండస్ట్రీ షాక్

14655

తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన నిర్ణయం తీసుకున్నారు మెగాస్టార్ వారసుడు, హీరో రాంచరణ్. తండ్రి మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీతోనే సొంతంగా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ స్థాపించారు. తండ్రిని తన సొంత బ్యానర్ లో ఖైదీ 150 మూవీతో వెండితెరపై మరో ఇన్నింగ్స్ కు కారణం అయ్యారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఖైదీ 150 ఘన విజయం సాధించింది కూడా. కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ఫస్ట్ మూవీనే హిట్ కొట్టింది. అదే ఊపులో తండ్రితో ప్రతిష్టాత్మకమైన సైరా నరసింహారెడ్డి సినిమా తీశారు చెర్రీ.

సైరా మూవీతోనే కొణిదెల ప్రొడక్షన్స్ డైలమాలో పడిందనే టాక్ సినీ ఇండస్ట్రీలో నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతో ప్రచారం చేసినా 50 కోట్ల రూపాయలపైనే నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. నష్టాన్ని ఏ మాత్రం లెక్కచేయని చెర్రీ.. తండ్రి చిరంజీవితోనే కొరటాల దర్శకత్వంలో కొత్త మూవీకి ప్లాన్ చేశారు. దీనికితోడు పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ కూడా కొణిదెల ప్రొడక్షన్స్ కిందకు తీసుకొచ్చారు.

కొణిదెల ప్రొడక్షన్స్ అయితే ప్రారంభించారు కానీ.. అందుకు తగినట్లు వర్కవుట్ చేసినట్లు కనిపించటం లేదు. కేవలం తండ్రి చిరంజీవి సినిమాలను మాత్రమే తీయటం, బయట సినిమాలపై ఆసక్తి చూపించలేదు రాంచరణ్. తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో ప్రొడక్షన్ హౌస్ నష్టాల్లోకి వెళ్లింది. సైరా కూడా 50 కోట్ల వరకు నష్టాలనే మిగిల్చింది. ఖైదీ 150 మూవీపై భారీ లాభాలు ఏమీ రాలేదు. దీంతో కొణిదెల ప్రొడక్షన్స్ ను క్లోజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సొంతంగా దగ్గరుడి చూసుకుని టైం రాంచరణ్ కు లేదు. భార్య ఉపాసన కూడా హాస్పటల్ పర్యవేక్షణ, వ్యవహారాలతో బిజీగా ఉన్నారు. మెగా బ్రాండ్ ఉన్న కొణిదెలను మరొకరి చేతుల్లో పెట్టి బ్రాండ్ డ్యామేజ్ చేసే ఉద్దేశం రాంచరణ్ కు లేదంట.

ఈ క్రమంలోనే కొణిదెల ప్రొడక్షన్స్ కింద ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. క్లోజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు చెర్రీ. ఈ విషయం సినీ ఇండస్ట్రీలో చాలా డిస్కషన్ నడుస్తోంది. కొరటాల మూవీ తర్వాత లేదా డిసెంబర్ నెలాఖరులో బ్యానర్ అధికారికంగా చిరిగిపోతున్నట్లు బాగా వినిపిస్తున్న మాట.

See Also : తెలంగాణ రోడ్లపై కేశినేని ట్రావెల్స్ పరుగులు