రామ్ చరణ్ కు తగ్గేదే లేదు.. ఎన్టీఆర్

153
jr Ntr Stunning looks
jr Ntr Stunning looks

రామ్ చరణ్ కు తగ్గేదే లేదు.. ఎన్టీఆర్

హ్యట్రిక్ హిట్ సినిమాలతో జోష్ మీదున్న జూ. ఎన్టీఆర్ ప్రస్తుతం కండల కసరత్తులో నిమగ్నమై ఉన్నారు. జై లవ కుశ సినిమాలో రావణ క్యారెక్టర్ లో నత్తితో డైలుగులు చెప్తూ మెప్పించిన యంగ్ టైగర్ మరోసారి సిక్స్ ప్యాక్ తో తన ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ వర్కవుట్స్ కు సంబంధించిన పిక్ ఒకటి లీకైంది.

ఇందులో ఎన్టీఆర్ కండలు తిరిగేలా వర్కవుట్స్ చేస్తున్నాడు ఎన్టీఆర్. గతంలో పూరి జగన్నాథ్ తీసిన టెంపర్ సినిమాలో ఓ పాటలో సిక్స్ ప్యాక్ తో కనిపించిన ఎన్టీఆర్.. ఈ సారి ఫుల్ అండ్ లెంగ్త్ కండలు తిరిగిన దేహంతో కన్పించనున్నాడట. ;ఇందుకోసం ప్రత్యేకంగా ట్రైనర్ కూడా నియమించుకున్నాడు. ఈ మధ్య రామ్ చరణ్ తో కలిసి తన ట్రైనర్ తోపాటు మూడు రోజుల అమెరికా ట్రిప్ కూడా వేసివచ్చారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రాముడు భీముడు అనే సినిమాలో నటిస్తున్నాడు జూ.ఎన్టీఆర్. అనంతరం రాజమౌళి దర్శకత్వంలో.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి భారీ మల్టీ స్టారర్ సినిమాలో చేయనున్నారు. అయితే త్రివిక్రమ్ సూచనల మేరకే.. యంగ్ టైగర్ సన్నబడుతున్నాడట. కథనుసారం.. ఇందలో స్లిమ్ అండ్ హ్యాండ్స్ గా కనిపించబోతున్నారట తారక్. అయితే వచ్చే అక్టోబర్ లో ప్రారంభం కానున్న రాజమౌళి సినిమా కోసమే ఎన్టీఆర్ మరింత కష్టపడుతున్నారు. ఇది భారీ యాక్షన్, ఎంటటైనర్ మూవీ కావడంతో రామ్ చరణ్ కూ సరిసమానంగా దేహాన్ని తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ఇప్పటికే ఆరుపలకల దేహం కలిగిన రామ్ చరణ్ కు ఏమాత్రం తగ్గకూడదని డిసైడ్ అయ్యాడట జూనియర్.

See Also: బాలివుడ్ ’కిలాడి‘ కోసం స్ట్రిప్ట్ రెడీ చేస్తున్న విక్రమ్