‘ఎన్టీఆర్‌’ సినిమాలో నటించే అవకాశం కొట్టేయండి..

0

ఎన్‌బీకే ఫిల్మ్స్ బ్యానర్ పై నందమూరి తారకరామా రావ్ జీవితం ఆధారంగా తొరకెక్కు తున్న చిత్ర ‘ఎన్టీఆర్‌’ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నందమూరి బాల కృష్ణ నటిస్తున్నారు.. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాలో మీకూ నటించాలని ఉందా? మీకు నటనలో ఆసక్తి ఉండి, మీ టాలెంట్‌ను ప్రదర్శించాలనుకుంటే [email protected] కి మీ వివరాలు పంపండి. “నటిస్తూ తెరమీద కనిపించాలాని ఆశ పడుతున్న యువతి యువకులకు ఇది సువర్ణ అవకాశం .. కానీ మంచి అవకాశాలు రానివారు కొందరు.. అలాంటి వారికి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం” అంటూ ఆ సినిమా యూనిట్‌ ఓ ప్రకటన చేసింది.

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ప్రాముఖ్యత గల కొన్ని పాత్రలకు కొత్తవారిని ఆహ్వానిస్తున్నామని, ఆసక్తి ఉన్న వారు రెండు ఫొటోలు పంపాలని, అలాగే స్మార్ట్‌ఫోన్‌లో తమ నటన ఏపాటిదో చూపెడుతూ 30 సెకన్లకు మించకుండా ఓ వీడియో తీసి తమకు మెయిల్‌ చేయాలని కోరింది.. ఇంక మరెందుకు ఆలస్యం… మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి…