పెళ్లైనా ప‌ర్వాలేదు.. అన‌సూయ‌.. నా ప‌క్క‌నుంటే చాలు.. నా భార్య కూడా అవ‌స‌రం లేదు..!

6

తెలుగు రాష్ట్రాల్లో హైప‌ర్ అది అనే పేరు ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. బుల్లితెర‌పై హైప‌ర్ ఆది చేసే కామెడీకి జ‌నాలు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకుంటున్నారు. జ‌బ‌ర్దస్త్ ప్రోగ్రామ్‌తో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయిన ఆది త‌న పంచ్‌ల‌తో పగ‌ల‌బ‌డి న‌వ్వేలా చేస్తున్నాడు. మొద‌ట అదిరే అభి టీమ్‌లో చేసిన ఆది ఆదికి వ‌రుస‌గా స్కిట్‌లు రాసిచ్చేవాడు. అయితే, అదిరే అభి హైప‌ర్ ఆదిలో ఉన్న టాలెంట్‌ను గుర్తించి స‌ప‌రేట్ టీమ్‌ను పెట్టించేశాడు.

ఆ నేప‌థ్యంలో హైప‌ర్ ఆది త‌న పంచ్‌ల‌తో అడ‌పా.. ద‌డ‌పా కాస్త లిమిట్ క్రాస్ చేస్తున్నాడ‌నిపిస్తుంది. ఈ మ‌ధ్య హైప‌ర్ ఆది ఫుల్ ఫామ్‌లో ఉండ‌టం, ఆది స్కిట్‌తోనే జ‌బ‌ర్ద‌స్త్ న‌డుస్తుంది అన్న ఇమేజ్ రావ‌డంతో మ‌న వాడు మ‌రింత రెచ్చిపోయి స్కిట్ చేస్తున్నాడు. ఎంత‌లా అంటే, త‌న స్కిట్ కోసం టాలీవుడ్‌లో న‌టిగాను, బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గాను రాణిస్తున్న అన‌సూయ‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్టు వాడేసుకునేంత‌ల అన్న‌మాట‌.

మొన్న‌టికి మొన్న‌.. అది వంగాలి.. నేను నిన్ను దెం..అలంటూ వ‌ల్గ‌ర్ కామెడీకి ప్రాధాన్య మిచ్చాడు హైప‌ర్ ఆది. ఆ షోలో కూడా అన‌సూయ ఉండ‌టం విశేషం. కేవ‌లం ఆ ఒక్క షోతోనే కాకుండా, హైప‌ర్ ఆది త‌న వ‌ల్గ‌ర్ కామెడీని అంత‌కంత‌కు పెంచుకుంటూ వ‌స్తున్నారు. దీంతో నెటిజ‌న్ల నుంచి సైతం హైప‌ర్ ఆది వ‌ల్గ‌ర్ కామెడీపై సోష‌ల్ మీడియాలో కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవ‌ల బుల్లితెర‌పై ప్ర‌సార‌మైన ఓ కామెడీ షోలో హైప‌ర్ ఆది త‌న స్కిట్‌లో అన‌సూయ‌ను త‌న‌కు ఇష్ట‌మొచ్చిన‌ట్టు వాడేశాడు. ఈమె మా అవిడండీ.. ఎంతో ప్రేమ‌గా చూసుకునేది. మ‌రో గంట‌నో.. రెండు గంట‌లో బ‌తుకుతుంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. అంటూ డైలాగ్‌ను ప్రారంభించిన ఆది మా ఆవిడ ఉన్నా.. లేకున్నా.. ఎప్ప‌టికీ నా ప‌క్క‌న స్థానం అన‌సూయ‌దే..! ఇంకెవ‌రు కూడా ఆ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌లేరు. నా ప‌క్క‌న అన‌సూయ‌ను త‌ప్ప మ‌రెవ్వ‌రినీ ఊహించుకోలేను..అంటూ చెప్ప‌డాన్ని నెటిజ‌న్లు త‌ప్పు బ‌డుతున్నారు.

ఇప్ప‌టికే పెళ్లై మూడు ప‌దులో.. నాలుగు ప‌దులో వ‌య‌స్సు ఉండి.. పిల్ల‌లు ఉన్న అన‌సూయ‌ను హైప‌ర్ ఆది అలా అన‌డాన్ని నెటిజ‌న్లు వ్య‌తిరేకిస్తున్నారు. అంతేకాకుండా, నా భార్య నా ప‌క్క‌న లేకున్నా ఓకే.. కానీ, అన‌సూయ నా ప‌క్క‌న లేకుండా ఉండ‌లేను అనడం ఏంట‌ని..? అస‌లు ఆ డైలాగ్‌కు ఏమ‌న్నా మీనింగ్ ఉందా..? అంటూ నెటిజన్లు హైప‌ర్ ఆదిని ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ విష‌యంపై త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందించిన శ్రీ‌రెడ్డి.. తాను కూడా ఇటీవ‌ల కాలంలో హైప‌ర్ ఆదిపై వ‌స్తున్న ట్రోలింగ్స్‌ను చూస్తున్నాన‌ని, హైప‌ర్ ఆది, అన‌సూయ‌ల షోల‌ను చూస్తే ఎవ‌రైనా త‌ప్పుబ‌డ‌తార‌ని, కామెడీ అంటే నేచుర‌ల్‌గా ఉండాలే కానీ.. ఇలా వ‌ల్గ‌ర్‌గా ఉండ‌కూడ‌ద‌నే త‌న అభిప్రాయాన్ని చెప్పింది శ్రీ‌రెడ్డి.