సైరాపైనే కాదు.. అర్జున్ సురవరం మూవీపైనా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ పడిందా?

496
pawankalyan effect on arjune suravaram movie

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ షాకింగ్ డిస్కషన్ నడుస్తోంది. రెండు, మూడేళ్లుగా అంతర్గతంగా ఉన్న ఈ చర్చ అర్జున్ సురవరం మూవీతో ఓపెన్ టాక్ అయిపోయింది. మూవీ ప్రమోషన్ లో పవన్ కల్యాణ్ పేరుగానీ, మెగా హీరోలు కానీ ఎంట్రీ అయ్యారంటే చాలు ఆ మూవీ ఢమాల్ అంట. రెండేళ్లుగా ఇదే సెంటిమెంట్ నడుస్తుందని కొందరు బయ్యర్లు సైతం అంతర్గత మాటల్లో మాట్లాడుకోవటం విశేషం. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు.

ఏపీలో ఎన్నికలకు ఏడాది ముందు నుంచే పొలిటికల్ హీట్  పీక్ కు వెళ్లింది. ఎన్నికలు అయిన తర్వాత ఆ హీట్ తగ్గకపోతే మరింత పెరిగింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలు అంతా కులాలు, మతాలు, వర్గాలుగా విడిపోయారు. పర్సనల్ ఇమేజ్ గా తీసుకున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ను చూస్తే చాలు వైసీపీ కార్యకర్తలు పర్సనల్ గా తీసుకుని మరీ ఏకిపారేస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ కనిపిస్తే చాలు.. మీడియాలో చీల్చిచెండాడుతున్నారు. ఇప్పటికే 151 నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉంది. వీళ్లందరూ కరుడుగట్టివాదులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ఏ సినిమాకు ప్రమోషన్ చేసినా.. దాన్ని చూడటానికి కూడా ఇష్టపడటం లేదు.

See also : చంద్రబాబు పర్యటనలో చెప్పుకోలేని చెప్పు కథ ఏంటీ.. ఆ చెప్పు విసిరింది ఎవరు?

సైరా ప్లాప్ కూడా అందులో భాగమేనా?

సైరా మూవీని మొదటి అన్ని వర్గాలు ఆదరించాయి. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ చేతులారా చెడగొట్టుకున్నారనేది ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. పవన్ కల్యాణ్ ఫాలోయింగ్ సూపర్ అని నమ్మి.. వాయిస్ ఓవర్లు ఇప్పించారు. అంతే వైసీపీ వాళ్లు అందరిలో నెగెటివ్ ఫీలింగ్ ఏర్పడింది. దానికి ఉదాహరణలో రాయలసీమలో ఆ మూవీ కలెక్షన్స్ భారీగా తగ్గటం. సైరా.. నరసింహారెడ్డి అని టైటిల్ పెట్టిన సీమ జనం దేకనుకూడా దేకలేదు. చివరికి సీఎం జగన్ తో భేటీతో అయితే గట్టెక్కుదాం అని అనుకున్నా చిరంజీవికి అది కూడా వర్కవుట్ కాలేదు.

కొత్తగా వచ్చే ఏ సినిమాకు అయినా పవన్ కల్యాణ్ సపోర్ట్ చేయటం, మద్దతు పలకటం చేస్తే మాత్రం 10 శాతం పాజిటివ్ గా వస్తే 80శాతం ప్రజల్లో నెగెటివ్ ఫీలింగ్ వెళ్లిపోతుంది. ఎందుకంటే రాజకీయం పవన్ కళ్యాణ్ ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి. ఓట్లు వేసిన జనమే.. టికెట్ కొని సినిమా చూసేది.. ఈ మాత్రం స్మాల్ లాజిక్ సినిమా ఇండస్ట్రీ మిస్ కావటం విశేషం కదా..