రాజమౌళిపై పెరుగుతున్న ఒత్తిడి.. ఆ రోజే షూటింగ్ షురూ..!

0

మల్టీస్టారర్ సినిమా తీయడం అంటే ఒక సవాల్. ఇక స్టార్ హీరోలతో ఈ ప్రయోగం అంటే కత్తిమీద సాములాంటిదే. ఎందుకంటే ఏ ఒక్క హీరోను తక్కువ చేసి.. చూపించినా ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఈ ప్రభావం ఆ దర్శకుడి తదుపరి సినిమాలపై ఉంటుంది. ఐదేళ్లు శ్రమించి బాహులబలి వంటి భారీ ప్రయోగంతో నేషనల్ వైడ్ గా కనెక్షన్ల వర్షం కురిపించారు ఎస్ ఎస్ రాజమౌళి. ఈ సిరీస్ అనంతరం మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు జక్కన్న.

టాలీవుడ్ లో ఉత్తర, దక్షిణ దృవాల్లాంటి నందమూరి, మెగా అభిమానులను ఒకేసారి థియేటర్ కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ తో భారీ మల్టీ స్టారర్ ప్రయోగానికి తెరలేపారు. ఈ సినిమాకు RRR అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు రాజమౌళి. ఇది ఇలా ఉంటే… ఈ చిత్ర కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. బ్రిటీష్ కాలానికి, వర్తమానానికి వారధిగా కథనం నడుస్తుంది. దీంతో దీనిని జక్కన్న ఎలా హ్యాండిల్ చేస్తారా? అని ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం RRR ప్రీపొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. దాదాపు రూ.300కోట్ల బడ్జెత్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ కు కూడా స్కోప్ ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. అనంతరం ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వలేదు యంగ్ టైగర్. రాజమౌళి సినిమాకోసం సిద్ధమవుతున్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నారు. డిసెంబర్ కు ఈ సినిమా షూటింగ్ పూర్తికానున్నట్లు సమాచారం. దీంతో రామ్ చరణ్ కూడా రాజమౌళి సినిమాకోసం ఫ్రీకానున్నారు. డిసెంబర్ నుంచి RRR షూటింగ్ మొదలు కానుందని… చిత్ర వర్గాల సమాచారం.