రంగస్థలం సినిమా ఫ్లాప్ కు భారీ కుట్ర..!

558
rumours created for making Rangasthalam movie flop
rumours created for making Rangasthalam movie flop

మైత్రీ మూవీస్, రామ్ చరణ్, సమంత కాంబినేషన్లో సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న రంగస్థలం సినిమాను అట్టర్ ఫ్లాప్ చేయడానికి ఇండస్ట్రీలో భారీ కుట్ర నడుస్తోంది. సోషల్ మీడియాలో రంగస్థలంపై రకరకాల వార్తలు పుట్టించేస్తున్నారు. చిరంజీవి రంగస్థలం చూసి పెదవి విరిచాడని, ఇలాంటి కథలు ఇప్పుడు నడవవని ఆయన చెప్పేశాడని ఓ పుకారు లేపారు. అలాగే రంగస్థలం కొనడానికి బయ్యర్లు ముందుకు రావట్లేదని మరో పుకారు లేపారు. సగం తీసిన తర్వాత సినిమా మళ్లీ రీ షూట్ చేశారన్న పుకారు కూడా నడుస్తోంది. సమంత సహకరించలేదని, అవుట్ డోర్ షూటింగ్ కు ఆమె ఒప్పుకోలేదని ఆమె కోసం మళ్లీ ఇండోర్ షూటింగ్ చేయాల్సి వచ్చిందని..ఇలా రకరకాల వదంతులు సృష్టిస్తున్నారు.

టాలీవుడ్ లో మైత్రీ మూవీస్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఒక పద్ధతిలో భారీ చిత్రాలు నిర్మిస్తూ వెళ్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ను దెబ్బతీయడానికి రకరకాల వదంతులు పుట్టిస్తూనే ఉన్నారు. అయితే, యూనిట్ లో సభ్యులు చెబుతున్న దానిబట్టి చూస్తే, రంగస్థలం అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని, ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ ఇంకా కలర్ ఫుల్ గా ఉందని తెలుస్తోంది. రామ్ చరణ్ కు ఉన్న మార్కెట్ ను బట్టి, మూవీ 70 కోట్లకు పైచిలుకు బిజినెస్ జరగచ్చని అంచనా వేస్తున్నారు.