నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోయాను: స్టార్ హీరోయిన్

123

వైవిధ్యమైన పాత్రల్లో నటించాలన్న, అమ్మవారుగా అవతారం ఎత్తాలన్నా.. నవ్వించాలన్న, కవ్వించే పాత్రల్లో నటించాలన్న, శివగామిలా రాజ్యాన్ని ఒంటిచేతితో నడిపించాలన్న కూడా ఒక్క రమ్యకృష్ణ గారి వల్లే సాధ్యం. వయసు పెరిగిన కూడా చెరగని అందంతో కుర్ర హీరోయిన్లకు అసూయ పుట్టించేలా నటించడంలో ఈమెకు సాటి ఎవ్వరూ లేరన్న విషయాన్నీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వందల సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె వరుస సినిమాలో అమ్మగా, అక్కగా, సోదరిగా నటిస్తూ వస్తున్నారు.

కాగా, ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే.. సినీ ఇండస్ట్రీలో పెద్ద తారల నుండి చిన్న తారల వరకు అందరు ఈ వెబ్ సిరీస్ లలో నటించడానికి సముఖత చూపిస్తున్నారు. ఇప్పటికే, సమంత, తమన్నా, అమల పాల్ తదితరులు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రమ్యకృష్ణ కూడా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారి ఆధారంగా చేసుకుని ‘ క్వీన్ ‘ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు. ద‌ర్శ‌కులు గౌత‌మ్ మీన‌న్, ప్రసాద్ మురుగేశ‌న్‌ తెర‌కెక్కించిన ఈ వెబ్‌సిరీస్‌లో ర‌మ్య‌కృష్ణ జ‌య‌ల‌లిత‌గా న‌టించారు. వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర పేరు శ‌క్తి. శ‌నివారం నుండి ఈ వెబ్ సిరీస్ ప్ర‌సారం కానున్న నేప‌థ్యంలో“నా జీవితంలో నేను తొలిసారి న‌టించిన వెబ్‌సిరీస్‌. నేను పోషించిన శ‌క్తి క్యారెక్ట‌ర్ నా హృద‌యానికి ఎంతో ద‌గ్గ‌రైంది“ అంటూ ర‌మ్య‌కృష్ణ ఓ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ రెండు సీజ‌న్స్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.