అల వైకుంఠపురములో డిజిటల్ రైట్స్ రేటెంతంటే ?

69
alavaikuntapuram movies digital rights

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో.. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా మూడోది. గతంలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు హిట్ అవ్వడమే కాదు భారీ కలెక్షన్లను కూడా రాబట్టిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్ లలో బిజీగా ఉంది. కాగా, ఇప్పటివరకు ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్స్, ట్రైలర్, మరియు పాటలు సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి.

ఇది ఇలా ఉండగా సంక్రాంతి కానుకగా జనవరి 11 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి సంబంధించిన ఒక వార్త ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.’నెట్ ఫ్లిక్స్’వారు సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ రేటుకు సొంతం చేసుకున్నట్టుగా సమాచారం.ఒక్క తెలుగు కోసమే దాదాపు 26కోట్లును సంస్థ చెల్లించిందని,దీనికి సంబంధించిన అన్ని లావాదేవీలు పూర్తి అయ్యాయనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కెర్లు కొడుతుంది. సినిమాలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. డీజే సినిమాలో నటించి హాట్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న పూజ హెగ్డే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా హిట్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. మరి సినిమా హిట్టా? .. ఫట్టా అనే విషయం తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే..