గాయని చిన్మయి శ్రీపాద పై లైంగిక దాడి..!

164
Chinmayi Sripada groped in an event sexual assault
Chinmayi Sripada groped in an event sexual assault

గాయని చిన్మయిపై లైంగిక వేధింపులు

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాదపై లైంగిక దాడి జరిగింది. గత ఆదివారం ఆమె ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అయితే, అక్కడ ఆమెకు ఒక భయానక అనుభవం ఎదురైంది. ఇదే విషయాన్ని తన అభిమానులతో ట్విట్టర్లో షేర్ చేసుకున్నారామె. ఒక వ్యక్తి తనను అసభ్యకరంగా తాకాడని, ఆ ఘటన తనకు షాక్ ఇచ్చిందని చిన్మయి పేర్కొన్నారు.

నిత్యం లైంగికవేధింపులకు గురయ్యే ఎంతోమంది అమ్మాయిల్ని తలుచుకుంటే తనకు వణుకు వచ్చేసిందని, సమాజంలో స్త్రీలకే కాక చిన్నపిల్లలకు కూడా ఎటువంటి రక్షణ లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆఖరికి మగపిల్లలపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయని, అయితే ఆ విషయాలు బయటికి రావడం లేదని చిన్మయి అంటున్నారు. ఒకవేళ ఎవరైనా ధైర్యంగా ముందుకొచ్చి చెబితే, వారిదే తప్పు అంటున్నారని, ఈ పరిస్థితి మారాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

chinmayi-sripada
chinmayi-sripada

తాను ధైర్యం చేసి పరిస్థితిని చెబుతున్నాను కానీ, చాలామంది భయంతో, ఒత్తిడితో ఈ సమస్యను బయటికి చెప్పుకోవడం లేదని తెలిపారు. అర్ధం చేసుకోవాల్సిన తోటి మహిళలే కించపరుస్తూ మాట్లాడే సంస్కృతి పోవాలని చిన్మయి స్పష్టం చేశారు. దాడి చేసే వాడికి మన భయమే ఆయుధమవుతుందని, కాబట్టి ధైర్యంగా వాడిని ఎదిరించి పోరాడటం నేర్చుకోవాలని ఆమె హితవు పలికారు. చిన్మయి మాటలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.