’మా‘ ప్రతినిధులపై మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు

114

సినీ నటీ శ్రీ రెడ్డి వ్యవహారంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. దీంతో ఆమెను సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించడాన్నితెలంగాణ యూత్ ఫోర్స్ ఖండించింది. శ్రీ రెడ్డి కి సినిమాలో అవకాశాలు ఇవ్వకుండా, మా సభ్యత్వాన్ని సైతం ఇవ్వకుండా అన్యాయం చేసిన మా అసోసియేషన్ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని.. యూత్ ఫోర్స్ ప్రతినిధులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు.

సినిమాల్లో అశ్లీలతను పెంచి పోషిస్తున్న సినీ పరిశ్రమ… తన హక్కులకు భంగం కల్గిందని అర్ధనగ్న ప్రదర్శన చేసిన శ్రీ రెడ్డిపై చర్యలు తీసుకోవడం బాధకరమని ప్రతినిధులు కమిషన్ కు వివరించారు. స్త్రీలను సినిమాలలో అర్ధనగ్నంగా చూపిస్తున్న… సినీ పరిశ్రమ, మా అసోసియేషన్ ప్రతినిధులపై ఏలాంటి చర్యలు తీసుకోవాలని వారు ప్రశ్నించారు. తెలుగు నటి అయిన శ్రీ రెడ్డికి తక్షణమే న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు హెచ్ఆర్సీని యూత్ ఫోర్స్ అధ్యక్షుడు రాములు కోరారు.