ఆ విష‌యంపై పెద‌వి విప్పిన ర‌ష్మిక‌..!

0

ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కులంద‌రూ ఆమె అందానికే ఫిదా అవుతున్నారు. ఆ బ్యూటీ గీత పాత్ర‌లో అంద‌ర్నీ మెస్మ‌రైజ్ చేసింది. ఆ అందాల భామ పెళ్లి ఆల్రెడీ ఫిక్స్ అయిందంటే న‌మ్మ‌గ‌ల‌రా..? అవును, గీత గోవిందం చిత్రంలో గీత పాత్ర పోషించిన హీరోయిన్ ర‌ష్మిక‌కు ఇప్ప‌టికే పెళ్లి ఫిక్స్ అయింది. ర‌ష్మిక పెళ్లి గురించి ఇటీవ‌ల కాలంలో చాలా పుకార్లు షికార్లు చేశాయి. ఎందుకంటే.. ఆమె తెలుగులో హీరోయిన్‌గా అడుగుపెట్ట‌క‌ముందే ఒక ద‌ర్శ‌కుడితో పీక‌ల్లోతు ప్రేమాయ‌ణం న‌డిపింది. ఆ ద‌ర్శ‌కుడితోనే పెళ్లి నిశ్చితార్ధం జ‌రుపుకుంది.

అయితే, గీత గోవిందం చిత్రం హిట్ కావ‌డం, నాని స‌ర‌స‌న దేవ‌దాస్ చిత్రంలో న‌టిస్తుండ‌టం, టాలీవుడ్‌లో మ‌రిన్ని సినిమాల‌కు సైన్ చేస్తుండ‌టంతో ఆమె పెళ్లి గురించి, నిశ్చితార్ధం గురించి పుకార్లు మొద‌ల‌య్యాయి. బెంగ‌ళూరుకు చెందిన ఈ బ్యూటీ కిరాక్ పార్టీ అనే క‌న్న‌డ సినిమాతో పాపుల‌ర్ అయింది. ఆ సినిమా హీరో క‌మ్ డైరెక్ట‌ర్ ర‌క్షిత్ శెట్టితో ర‌ష్మిక‌కు గ‌త ఏడాది నిశ్చితార్ధం జ‌రిగింది.

ర‌ష్మిక‌కు నిశ్చితార్ధం జ‌రిగినా.. తెలుగులో సినిమాల‌ను ఒప్పుకుంది. అయితే, ఇప్పుడు ఆమె ఆ డైరెక్ట‌ర్‌కు డిచ్ కొట్టింద‌నే ప్ర‌చారం మొద‌లైంది. ఆ విష‌యంపై పెద‌వి విప్పింది ర‌ష్మిక‌. త‌న పెళ్లి ఆగ‌లేద‌ని క్లారిటీ ఇచ్చింది. తెలుగులో వ‌రుస‌గా సక్సెస్‌లు రావ‌డం, సినిమాల్లో ఆఫ‌ర్లు పెర‌గ‌డంతో పెళ్లిని ర‌ద్దు చేసుకుంద‌న్న వార్త‌ల్లో నిజం లేద‌ని, ర‌క్షిత్ శెట్టితోనే త‌న పెళ్లి జ‌రుగుతుంద‌ని క్లారిటీ ఇచ్చేసింది. అయితే, పెళ్లి మాత్రం ఈ ఏడాది మాత్రం ఉండ‌ద‌ట‌. నిశ్చితార్ధం జ‌రిగిన త‌రువాత ఒక‌రినొక‌రు అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు చెప్పింది. అందుకే రెండేళ్ల‌పాటు త‌మ పెళ్లిని వాయిదా వేసుకున్నామ‌ని, అందుకు ఇరువురు కుటుంబ స‌భ్యులు కూడా ఒప్పుకున్నార‌ని చెప్పింది ర‌ష్మిక‌.