ప్రత్యేకం: చికెన్ లాగించేస్తారు.. శాఖహారులుగా ఇలా బిల్డప్ ఇస్తారు..

315

ఇటీవల శాకాహారంపై గౌరవం పెరగడంతో తాము కూడా ఒకరకమైన శాకాహారులమేనంటూ చెప్పుకొంటున్నారు ఇండియన్స్. ఓ పక్క చికెన్, మటన్ లాగించేస్తూనే శాఖాహారులుగా కొందరు ఇండియన్స్ చెప్పుకుంటున్నారని ఓ సర్వే తెలిపింది. వివిధ సందర్భాల్లో మాంసాహారం తీసుకుంటున్నా అది లెక్కలోకి రాదని సమర్ధించుకుంటారంట. గురు, శనివారాలు నాన్ వెజ్ ముట్టం అంటూనే.. మిగతా రోజుల్లో లాగించేస్తుంటారని చెబుతున్నారు. ఇలాంటి వారిని ఎనిమిది కేటగిరీలు విభజించి.. వారికి వివిధ రకాలు పేర్లు పెట్టారు.

1. పూర్తి శాఖాహారులు (ఏ రూపంలోనూ మాంసాన్ని తీసుకోకపోవడం అంటే వీరు కేవలం ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గింజలు, కందలు తింటారు.)

2.వీరు కోడి గుడ్డు తింటారు. కానీ చికెన్, మటన్, ఇతర మాంసాహారం తినరు. ( ఎగ్‌టేరియన్లు)

3. కోడిగుడ్డుతో చేసిన కేక్ లు, ఇతర ఆహార పదార్ధాలు తీసుకుంటారు.కానీ బాయిల్డ్ ఎగ్, ఆమ్లేట్ తినరు (వీరు కేకిటేరియన్లు)

4. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తారు. అందులోని ముక్కలు తినరు. చికెన్, మటన్ కర్రీలోని గ్రేవీ తింటారు.. ముక్కల జోలికి వెళ్లరు. ( వీరు గ్రేవిటేరియన్లు)

5. చికెట్, మటన్ లాగించేస్తారు. కాకపోతే బయట మాత్రమే. ఇంట్లో మాత్రం అస్సలు తినరు.(వీరు రిస్ట్రిక్టేరియన్లు)

6. లిక్కర్ పార్టీలు, మందు కొట్టినప్పుడు మాత్రమే వీళ్లు మాంసం తీసుకుంటారు. మిగతా టైంలో శాఖాహారులు ( వీరు బూజిటేరియన్లు )

7. ఈ కేటగిరీ చాలా డేంజర్. తినాలనే కోరిక ఉంటుంది. ఎవరైన ఫోర్స్ చేస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటారు. మిత్రులు లేదా బంధువులు బలవంతం చేస్తే చికెన్, మాంసం తింటారు ( వీరు ఫోర్సిటేరియన్లు )

8. వీరొక అవకాశవాదులు. గురు, శని లాంటి కొన్ని రోజుల్లో మాంసం ముట్టరు. మిగిలిన వారాల్లో ఫుల్ గా తినేస్తారు ( వీరు క్యాలెండర్టేరియన్లు )

భారతదేశంలో మాంసం తినేవారిని ఎనిమిది కేటగిరీలుగా విభజించారు. అందరూ ఏదో ఒక సందర్భంలో తింటూనే శాఖాహారులుగా చెప్పుకోవటానికి ఇష్టపడతారని అంటున్నారు పరిశోధకులు.