ఇదేం విడ్డూరమండీ బాబు.. ఉల్లి దండలతో పెళ్లా.. !!

40

దేశంలో ఉల్లి కొరత రోజు రోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఉల్లి ధరలు తగ్గించాలంటూ పలు చోట్ల నిరసనలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుడు, వధువు పెళ్లి పందిరిలోనే వినూత్న రీతిలో నిరసన తెలిపిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని వారణాసీలో చోటు చేసుకుంది.

పెళ్లిలో పూలదండలు మార్చుకోవడం సాధారణమే. అయితే, తమ పెళ్లిలో పూలదండలతో పాటు ఈ వరుడు, వధువు ఉల్లి, వెల్లుల్లి దండలు మార్చుకున్నారు. ఇకపోతే పెళ్ళికి వచ్చిన అతిధులు కూడా ఈ ఉల్లిని బహుమతులుగా ఇచ్చారట. పెరుతున్న ఉల్లి రేటు కారణంగా ప్రజలు బంగారాన్ని చూసినట్లు చూస్తున్నారు.

అందుకే ఈ పెళ్లిలో వరుడు, వధువు ఈ దండలను మార్చుకున్నారు. ఈ మేరకు సమాజ్ వాదీ పార్టీ నేత సత్య ప్రకాశ్ మాట్లాడుతూ ఉల్లి ధరలపై నిరసన తెలిపిందుకే ఈ జంట వినూత్న రీతిలో ఇలా దండలు మార్చుకున్నారు. అంతేకాక ధరల పెరుగుదలపై తమ పార్టీ కూడా వినూత్న రీతిలో నిరసనలు తెలిపిందని గుర్తు చేశారు.