ఈ ఒక్క పాటతో బన్నీ దుకాణం సర్దుకోవాలట..

46

2020 సంక్రాంతి కి దాదాపుగా నాలుగు సినిమాల వరకు విడుదల కాబోతున్నాయి. మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, దర్బారు, ఎంత మంచివాడవురా ఈ నాలుగు సినిమాలు సంక్రాంతికి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కానీ ఈ నాలుగు సినిమాల్లో ముఖ్యంగా వినిపించే సినిమాల విషయానికొస్తే సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో సినిమాలు వినపడుతున్నాయి.

ఈ రెండు సినిమాలు నువ్వా నేనా పోటీ పడుతున్నాయి. ముందుగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 12 న అల వైకుంఠపురములో సినిమా సందడి చేయబోతుంది. అయితే తాజాగా సరిలేరు నీకెవ్వరూ నుండి మరో పాట విడుదల అయ్యింది. భగ భగ మండే నిప్పులొచ్చినా అంటూ సాగిన ఈ పాటని చిత్ర బృందం విడుదల చేశారు.

ఈ పాటలో మహేష్ మిలటరీ ఆఫీసర్ గా కనిపిస్తాడు. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. విడుదలయిన కొద్దీ నిమిషాలకే వ్యూస్ తో దూసుకు పోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏది ఏమైనా ఏ సినిమా కలెక్షన్ కింగ్ గా దూసుకుపోతుందో తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే..