చుట్టూ అమ్మాయిలతో రెచ్చిపోతున్న టాలీవుడ్ హీరో..

133

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ కు ఈ ఏడాదిలో ఒక్క హిట్ చిత్రం కూడా పడలేదు. ఎన్టీఆర్ బయోపిక్ అంటూ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలను తెరకెక్కించారు. ఆ సినిమాలలో ఏ ఒక్క సినిమా కూడా అతనికి బాలయ్యకు చేతి ఖర్చులు కూడా అందించలేక పోయాయి. దాంతో బాలయ్య రూటు మార్చాడు. కథలో సారాంశం అందించడం కాదు యువతను ఆకట్టుకోవాలంటే దబిడి దిబిడే స్టెప్పులు చూపించాలనుకున్నారు.

ఈ నేపథ్యంలో బాలయ్య 105 చిత్రంగా రూలర్ చిత్రం తెరకెక్కుతుంది. కె ఎస్ రవికూమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. భారీ యాక్షన్ రొమాంటిక్ కమర్షియల్ చిత్రం రూలర్. ఇప్పటికి వరకు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ , టీజర్లు, సాంగ్స్ మరియు థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లోను, సినీ ఇండస్ట్రీలోను, అటు నందమూరి అభిమానుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది.

ఇకపోతే షూటింగ్ ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఈ నెల 20 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.బాలకృష్ణ మరియు కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన జైసింహా సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన జోడిగా సోనాల్ చౌహాన్,వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సందర్బంగా విశాఖపట్టణంలో ‘రూలర్’ సినిమా ఆడియో వేడుక జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ విశాఖ సిటీ అధ్యక్షుడు కె.శంకర్‌, టీడీపీ నగర కార్యదర్శి పట్టాభిరామ్‌, ఆలిండియా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్‌ కన్వీనర్‌ తిలక్‌లు విడుదల చేశారు. మరో గంటలో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కు రూలర్ చిత్రయూనిట్ తో పాటు బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.