రొమాంటిక్ ప్రియులకు షాక్ ఇస్తున్న పాయల్..

178
Actress Payal Rajput New Hot Photoshoot Stills

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో పాయల్ కుర్రకారు హృదయాలను దోచేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత రొమాన్స్ ప్రధానంగా కలిగిన సినిమాల్లోనే పాయల్ కి అవకాశాలు వస్తున్నాయి. ఆ తరహా పాత్రలే ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.

కాగా , రొమాన్స్ కి కాస్త దూరంగా ఆమె చేసిన ‘వెంకీమామ’ సినిమా ఆమెకి విజయాన్నిచ్చింది. నటనకి అవకాశం వున్న ఈ సినిమాలో పాత్ర ఆమెకి మంచి మార్కులను తెచ్చిపెట్టింది. దీంతో ఇకపై నటనకి ప్రాధాన్యత కలిగిన సినిమాలనే చేయాలనే నిర్ణయానికి పాయల్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. పెద్ద హీరోల సరసన పాత్రలో నటించడానికి ఆమె సముఖత చూపిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె డిస్కోరాజా చిత్రంలో నటిస్తున్నారు.. ఈ వార్త నిజమయితే.. ఇంకా పాయల్ కుర్ర కళ్ళకు వేసినట్లే అని జనాలు గుసగుసలాడుతున్నారు.