మాకు కష్టాలు తప్పలేదు.. కానీ దోచుకున్నది దాచుకునేందుకు సులువైంది..

99
1000,500 old note band, 2 years
1000,500 old note band, 2 years

సరిగ్గా 2016 నవంబర్ 06వ తేదిన మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు రాత్రికి రాత్రి ఆనాడు పెద్ద నోట్లను రద్దు చేవాడు.. ఉన్న ఫలంగా ఎప్పుడు లేని విధంగా దేశ వ్యాప్తంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడి మరీ ఐదు వేలు, రెండు వేలు, మూడు వేలు, ఇలా తమ వద్ద దాచుకున్న మొత్తాన్ని తిరిగి 2000 రూపాయల నోట్లను తెచ్చు కొని వాటికి చిల్లర చిక్కక ఇబ్బందులు పడ్డాం.. అంగటింటిలో సరుకులు ఇవ్వక, పూట గడవని వారు లైన్టలో పెట్టి మరీ వారి వద్ద ఉన్న సొమ్మును కొందరు కొత్త నోట్లుగా మార్చుకున్నారు.. ఇది ఒక రకమైతే..

Image result for old 1000, 500 notes

రెండవ రకం.. పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యక్తులు, బ్యాంక్ అధికారులు ఏకమై కొటాను కోట్ల నల్లధనాన్ని తిరిగి కొత్త నోట్లుగా మార్చుకొని భద్రంగా లాకర్ లో దాచుకున్నారు..

ఇప్పటికి కూడా దేశంలోని నల్లధనాన్ని మొత్తం బయటకు తీస్తా అని చెప్పిన మోది కనీసం ఒక్క జన్ధన్ ఖాతాలో 10వేలు వేసిన దాఖలాలైతే లేవు.. ఇదేనా మీరు సాదించిన ప్రగతి అని నేటి జనులు నోట్ల రద్దు డేగా ఈ రోజు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు..

Image result for old 1000, 500 notes

ఇప్పటి దాక ఎన్ని వేల కోట్ల రూపాయలు నల్ల ధనం బయటకు వచ్చిందో తెలియదు కానీ 2వేల నోట్ల వల్ల మాత్రం మరింత పెరిగిందని చెప్పవచ్చును.. అదే మోడి ఉన్న ఫలంగా 2వేల నోట్లను రద్దు చేస్తే బాగుంటుదని నేటి జనులు ప్రశ్నిస్తున్నారు.. గతంలో ఉన్న వెయ్యి రూపాయ నోట్ల కన్నా ఇప్పుడు 2000 రూపాయల నోట్లు నల్ల డబ్బుగా చాలా మంది దగ్గర లాకర్స్ లో ఉన్నాయని వారు తెలిపారు.. ప్రజలకు మొదీ చేసే మంచి పని ఏమన్నా ఉంటే తక్షణం 2000వేల నోట్లను రద్దు చేయాలని వారు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు..

Image result for 500 and 2000 new notes

నిజానికి గతంలో కన్నా ఇప్పుడే ఈ బీజేపీ ప్రభుత్వం లోనే ఎక్కువ ఆర్థిక కుంబ కోణాలు జరిగాయని మరి కొందరు అంటున్నారు.. నీరవ్ మోదీ తరహాలో చాలా మంది బ్యాంక్ లనుంచి తీసుకున్న సోమ్మును చెల్లించ కుండా ఎగ్గొట్టడం వల్ల నేడు బ్యాంక్ లు దివాలాతీసే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.. మరి ఇది ఇలా ఉంటే దేశంలో మాత్రం నోట్లు రద్దు తరువాత కూడా ఏ సగటు సామాన్యుడికి కూడా మేలు జరగ లేదని చెప్పవచ్చు..

Image result for 500 and 2000 new notes