టీవీ 10 న్యూస్ ఛానల్ పెట్టుబడి లో గోల్ మాల్.. ఆందోళనకు దిగిన బాధితులు..!

6

తమ గొంతు వన్పించేందుకు సీపీఎం నేతలు ప్రారంభించిన.. 10టీవీ పెట్టుబడుల విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ బాధితులు ఆందోళనకు దిగారు. షేర్ల పేరుతో తమ వద్ద భారీగా వసూళ్లు చేపట్టి.. లాభాలు పంచుతామని…చెప్పి.. ఇప్పుడు ప్లేట్ పిరాయిస్తున్నారని మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు మండలం, చెరువు మాధవరం గ్రామంలోని అంజనేయస్వామి గుడివద్ద బాధితులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన బాధితులు సీపీఎం నేతల తీరును ఎండగట్టారు.  మాధవరం, సుందరయ్య నగర్ తదితర గ్రామాలకు చెందిన పలువురు మాట్లాడుతూ ఏడేళ్ల క్రితం సీపీఎం నాయకులు గ్రామాల్లో పర్యటించి 10 టీవీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారన్నారు. ఇందుకోసం షేర్లు చెల్లించాలని,  షేర్ విలువ పెరిగిన తర్వాత లాభాలతో తిరిగి తమ సొమ్మును తీసుకొవచ్చని నమ్మబిలికారన్నారు.

   సీపీఎం నేతలు కావడంతో వారు చెప్పినది నిజమేనని నమ్మిన పార్టీ సానుభూతిపరులు, వ్యవసాయ కూలీలు, రిక్షా వర్కర్లు, మహిళలు, వెట్టిచాకిరి చేసే కార్మికులు రూ.3 ల వడ్డీకి అప్పులు చేసి మరీ… సీపీఎం నేతలకు చెల్లించినట్లు తెలిపారు. దీనికి ప్రతిగా వీరికి 10 టీవీ లోగో ఉన్న బాండ్లను, రశీదులను అందేసినట్లు వివరించారు. ఇటీవల కాలంలో రూ.10  ఉన్న షేర్ విలువ ప్రస్తుతం రూ.105 పెరిగిందని ఆన్లైన్లో చూసుకుంటే తెలిసిందన్నారు. తమ డబ్బులు తమకు లాభాలతో కలిపి తిరిగి చెల్లించాలని సీపీఎం నేతలను కోరగా… లాభాలు ఏమీ లేవని,  కేవలం అసలు మాత్రమే తిరిగి చెల్లిస్తామని చెబుతున్నట్లు బాధితులో పేర్కొన్నారు.

  దీంతో ఇదేనా సీపీఎం నేతలు పేదల పట్ల అనుసరిస్తున్న వైఖరి అంటూ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బాధితులు బాణవత్ సుశీల రూ.1500, తన్నీరు మరియమ్మ రూ.1000, అంకమ్మ రూ.1500, గుంజి మంగమ్మ రూ.1500, రమణ రూ.1000, వేముల శ్రీనివాసరావు రూ.30,000, ఇర్ల శ్రీనివాసరావు రూ. 40 వేలు,  వేముల సుబ్బమ్మ రూ.20,000, ఇరుగుదండ్ల శ్రీనివాసరావు రూ.10,000, సదాశివరావు రూ.5,000, ఇరుగుదండ్ల నాగరాజు రూ.5వేలు, ఆలకుంట రామకృష్ణ 10,000, డి.పుల్లయ్య రూ.10వేలు, పరశురాం రూ.2,000, లక్ష్మణ్ రూ.5,000, కృష్ణ రూ.1,000, ఉప్పుతల పార్వతమ్మ రూ.2,000, వెంకన్న రూ.2వేలు, బిక్షం రూ.2,000, వెంకటేశ్వరరావు రూ.2,000, ఇంకా వేర్వేరు గ్రామాల్లో చాలామంది బాధితులు ఇలా 10టీవీకి నగదు చెల్లించినట్లు తెలిపారు. తమ డబ్బులు లాభాలతో కలిపి తిరిగి చెల్లించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.