శృంగారంలో ఒక్కసారి పాల్గొన్నా.. నాకు నెలసరి రాలేదు.. ఒక్కసారికే గర్బం వస్తుందా..?

18

హలో డాక్టర్.. నా పేరు భవ్య నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నా వయస్సు 18 సంవత్సరాలు డిడ్రీ చదువుతున్నాను.. నా బాయ్ ఫ్రెండ్ తో అనుకోకుండా ఓ బలహీన మైన క్షణంలో ఇద్దరం ఒక్కటైయ్యాం.. ఆ తరువాత ఎప్పుడు కలవ లేదు.. కానీ ప్రతి నెల రావలసిన నెలసరి ఈ నెల రాలేదు.. కాస్త భయంగా ఉంది ఒక వెల గర్బం వస్తే ఎలా పోగొట్టుకోవాలో చెప్పగలరా…?

ముందుగా నీకో చిన్న మాట.. చదువు కోవడానికని నిన్న పంపిస్తే నీ ఇంట్లో తల్లి దండ్రులు నీవు చేస్తున్న దేమిటి.. ముందు నీలో ప్రవర్తనను మార్చుకో.. ఇలా ఆలోచించటం వల్ల నీ చదువు కూడా అటకెక్కుతుంది.. ఇక మీదట నీ బాయ్ ఫ్రెండ్ తో కూడా కాస్త దూరంగా ఉండటానికి ప్రయత్నించు.. ప్రస్తుతం మీది కేవలం అట్రాక్షన్ మాత్రమే.. ఇది ఇద్దరికి కూడా శృంగారం పై ఆసక్తి కోరికలు ఎక్కువగా ఉండటం చేత మీరు ఆ తప్పు చేశారు.. ఇక పై ఇలాంటివి జరగకుండా చూసుకొండి.. ఇక పోతే నీవు ముందుగా చేయాల్సింది ప్రెగ్నెన్సి టెస్టు చేయించుకో.. టాక్టర్ దగ్గరకు వెళ్లడానికి భయమైతే మార్కెట్ లో అనేక రకాలేనా పద్దతుల్లో 3 నుండి 4 నిమిషాల్లో చెక్ చేసుకొవచ్చు.. “ట్రూ చెక్ ఇన్ స్టాంటి ప్రెగ్నెన్సి టెస్ట్” ” రివెల్ ప్రెగ్నెన్ని” వీటి వల్ల యురిన్ ద్వారా తెలుసు కోవచ్చు.. వాటి ద్వారా ప్రయత్నించి తెలుసు కోండి.. ఇక గర్బం వచ్చిందని తెలిస్తే డాక్టర్లను సంప్రదించి అనంతరం గర్బ నిరోదక మాత్రలు ఏవి వాడితే బాగుంటుందో సలహా మేరకు వాడండి..

ఒక్కో సారి రక్తం తక్కువగా ఉండటం వల్ల కూడా రుతు క్రమం సరిగా రాకుండా ఉంటుంది.. మీరు పెద్దగా కంగారు పడనవసరం లేదు.. అలాగని గర్బం రాకూడదని కూడా లేదు… రుతు క్రమం వచ్చిన తరువాత ముందు 4 లేదా 5 రోజుల్లో స్త్రీ పురుషులు సంభోగం చుసినప్పుడు కూడా ఆండాశయం లోని అండాలు మరియు, పురుషకఱం గా చెప్పుకునే శుక్ర కణం కలిస్తే మొదటి సారి కూడా గర్బం రావచ్చు.. అయినా చదువుకున్న పిల్లలు మీకు సరి అయిన అవగాహన లేకపోతే ఎలా చెప్పండి..