50 మంది మావోయిస్టులు.. ఎమ్మెల్యే, కిడారిని, మాజీ ఎమ్మెల్యేను.. పాయింట్ బ్లాంక్‌లో గ‌న్‌పెట్టి..!

4

విశాఖ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగ‌ట్టారు. అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావుపాటు, అర‌కు మాజీ ఎమ్మెల్యే శివేరి సోమును కూడా మావోయిస్టులు కాల్చి చంపారు. అర‌కుకు ప‌ది కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న డంబ్రి గూడెం వ‌ద్ద వీరిని చుట్టిముట్టిన మావోయిస్టులు ఒక్క‌సారిగా కాల్పులు జ‌రిపారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల‌ను వాహ‌నంలోనే ఉంచి, మిగ‌తా వారిని దించేసిన మావోయిస్టులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఇద్ద‌రినీ కాల్చి చంపేశారు.

అయితే, ఇవాళ కొద్దిసేప‌టి క్రితం అర‌కులో ఉన్న ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌లో కిడారితోపాటు శివేరి సోము భోజ‌నం చేశారు. ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్ నుంచి ప‌ది కిలోమీట‌ర్లు వెళ్లిన అనంత‌రం మావోయిస్టులు చుట్టుముట్టారు. దాదాపు 50 మంది మావోయిస్టులు అతి స‌మీపం నుంచి ఇద్ద‌రినీ కాల్చి చంపేశారు.

కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు ఇటీవ‌లే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. గ‌త కొంత కాలంగా మావోయిస్టుల హిట్ లిస్ట్‌లో ఉన్నారు కిడారి. గ‌తంలోనూ కిడారిని మావోయిస్టులు అనేక సంద‌ర్భాల్లో హెచ్చ‌రించారు. కిడారితోపాటు శివేరి సోమును కొంత‌కాలంగా టార్గెట్ చేసుకున్న మావోయిస్టులు ఇవాళ వాళ్ల ప్రాణాల‌ను తీశారు.