విశాఖపట్టణంలో భారీ జాతీయ జెండా ప్రదర్శన

0

విశాఖలో స్వేఛాగీతం మార్మోగింది. జాతీయ పతాకాన్ని వాడవాడలా ఊరేగిస్తూ ఆనాటి మహోన్నత వ్యక్తుల ఫలాలను నేటి తరానికి చాటి చెప్పారు. గణతంత్ర దినోత్సం సందర్భంగా విశాఖనగరం జీవిఎంసీ వద్ద జరిగిన జాతీయ పతాక ర్యాలీని మంత్రి గంటా శ్రీనివాస్ రావు ప్రారంభించారు. ఆదునిక యుగంలో భావితరాల అభ్యున్నతి కోసం పాటు పడిన ఆనాటి మహోన్నత వ్యక్తుల త్యాగ ఫలాన్ని వివరించేందుకు ఏర్పాటు చేసిన భారీ త్రివర్ణపతాక ప్రదర్శనలో వేలాదిగా విద్యార్ధులు పాల్గొని దేశ భక్తిని చాటుకున్నారు.

బ్రిటీష్ సామ్రాజ్యవాదుల నుంచి భరత మాతను రక్షించడంలో ప్రాణాలను సైతం అర్పించిన అమర వీరుల జీవిత చరిత్రను నేటి తరం యువతకు తేలిసేలా ఏర్పాటు చేసిన కార్యక్రమంతో ఎంతో స్ఫూర్తి పొందవచ్చని మంత్రి గంటా శ్రీనివాస్ రావు అన్నారు. అనంతరం భారీ ర్యాలీగా తరలివచ్చిన విశాఖ వాసులతో, మువ్వన్నెల జెండా ప్రదర్శన, నగరంలోని ప్రధాన ప్రాంతాల మీదుగా సాగింది. ఈ జాతీయ జెండా ప్రదర్శనలో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.